Son Signed IAS Father Retirement Order :తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్‌పై కుమారుడు సంతకం చేయడం, వినడానికి ఎంత బాగుందో కదా!. ఇలాంటి అరుదైన ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. భరత్‌పుర్ డివిజనల్ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సన్వర్మల్ వర్మ పదవీ విరమణ ఆర్డర్‌పై, కార్మిక విభాగం సంయుక్త కార్యదర్శి హోదాలో కుమారుడు కనిష్క కటారియా సంతకం చేశారు. ఈ విషయాన్ని కనిష్క సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ అధికారుల వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇద్దరికీ ఒకేసారి ప్రమోషన్
ఇంతకుముందు, ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. తండ్రీకొడుకులకు ఒకేసారి శాలరీ పెరిగింది. సన్వర్మల్ వర్మ శాలరీ సెలెక్షన్ పే స్కేల్ నుంచి సూపర్‌టైమ్ పే స్కేల్(Level 14 in Pay Matrix)కు పెరిగింది. అదే సమయంలో కనిష్క కటారియాకు జూనియర్ పే స్కేల్ నుంచి సీనియర్ పే స్కేల్‌కు(Level 11 in Pay Matrix) శాలరీ పెరిగింది.
సన్వర్మల్ శర్మ రిటైర్మెంట్ ఆర్డన్ సెప్టెంబర్ 28న కినిష్క జారీ చేశారు. జైపుర్ డివిజనల్ కమిషనర్ ఐఏఎస్ రష్మీ గుప్తాకు భరత్‌పుర్ డివిజనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఆర్ఏఎస్ అధికారుల బదిలీ, పదవీ విరమణ, ఇతర సర్వీసులకు సంబంధించిన ఉత్తర్వులపై జాయింట్ సెక్రటరీ మాత్రమే సంతకం చేస్తారు.