How to Make Banana Milkshake at Home:ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఈ టైమ్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం ఏవేవో శీతల పానీయాలు తీసుకుంటుంటారు. అయితే, వాటిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం దొరికినా తర్వాతర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అలాకాకుండా.. ఉండాలంటే కూల్‌డ్రింక్స్‌కు బదులు అరటి పండుతో(Banana) ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం మంచిది అంటున్నారు.
అరటిపండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అందరికీ అందుబాటు ధరలో ఉండే బనానాతో మిల్క్ షేక్ తయారుచేసుకొని తాగితే సమ్మర్లో ఎండ వేడిమి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే.. డీహైడ్రేషన్, నీరసం దరిచేరకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. దీని తయారీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బనానా మిల్క్ షేక్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బాగా పండిన అరటిపండ్లు - 4 చిన్నవి లేదా 2 పెద్దవి
- పాలు -1 కప్పు
- చక్కెర - రుచికి సరిపడా
- జీడిపప్పు, బాదం తరుగు - కొద్దిగా
- ఐస్ క్యూబ్స్ - కొన్ని(అవసరం మేరకు)