తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటివరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనను'- సీట్ల పంపకంపై ఎస్పీ- కాంగ్రెస్ మధ్య చిచ్చు - ఎస్పీ కాంగ్రెస్ కూటమి

SP Congress Seat Sharing : ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​తో సీట్ల పంపిణీ ఖరారయ్యే వరకు రాహుల్​ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రాహుల్​ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పాల్గొనరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు లోక్​సభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.

sp congress seat sharing
sp congress seat sharing

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 3:07 PM IST

SP Congress Seat Sharing : లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​తో సీట్ల పంపిణీ ఖరారయ్యే వరకు రాహుల్​ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొనరని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లో 80స్థానాల్లో కాంగ్రెస్​కు 15 సీట్లు మాత్రమే ఇస్తామని సమాజ్​వాదీ పార్టీ చెప్పింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహాయ సహకారాలు అందిస్తామని తేల్చిచెప్పింది.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్షాలు సీట్ల పంపకాల విషయంలో ఏకతాటిపైకి రాలేకపోతున్నాయి. ఇప్పటికే బంగాల్ , పంజాబ్​లలో అధికార తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిపోరుకే సిద్ధమయ్యాయి. సమాజ్​వాదీ పార్టీ చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో అఖిలేశ్ యాదవ్ పాల్గొంటారని సమాజ్​వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని అంటున్నాయి. కాగా, ఉత్తర్​ప్రదేశ్​లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలిచింది.

ఒంటరిగానే పోటీ
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనుందని వదంతులు వ్యాపించడం వల్ల ఆమె వాటికి తెరదించారు. వదంతుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఎన్నికలకు ఒంటరిగా వెళతామని పలుమార్లు ప్రకటించినా పొత్తులపై రోజుకొక వదంతులను వ్యాప్తి చేస్తున్నారని మాయావతి మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుంటే లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని పార్టీలు మెరుగైన ఫలితాలను సాధించలేవనడానికి ఇది రుజువని తెలిపారు. దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్న పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రజా బలంతోనే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీతో పొత్తు పెట్టుకుంది.

చండీగఢ్ మేయర్ రాజీనామా- బీజేపీలోకి ముగ్గురు ఆప్​ కౌన్సిలర్లు

MSPపై కేంద్రం కీలక ప్రతిపాదన- ప్రభుత్వ ఏజెన్సీలతో ఐదేళ్ల ఒప్పందం! రెండు రోజుల్లో రైతుల నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details