తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్- కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు - Southwest Monsoon Kerala

Southwest Monsoon Kerala : నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 3, 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది.

Southwest Monsoon Kerala
Southwest Monsoon Kerala (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 11:53 AM IST

Southwest Monsoon Kerala :దేశమంతా భానుడి భగభగలతో మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల వైపు విస్తరించినట్లు వెల్లడించింది. మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశమున్నట్లు పేర్కొంది. అంచనా వేసిన దాని కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలను తాకడానికి రెమాల్ తుపాను కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఒక రోజు ముందుగానే
మే 31 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేయగా ఒక రోజు ముందుగానే ప్రవేశించాయి. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని వల్ల ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో అంచనా వేసింది.

వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది.
ఇదిలా ఉండగా, మన దేశంలో 52శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారంగా ఉంది. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ముందుగా కేరళను తాకిన రుతుపవనాలు ఎప్పుడంటే
భారత వాతవరణ శాఖ గణంకాల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్​ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్​8న, 2022లో మే 29న, 2021లో జూన్​ 3న, 2020లో జూన్​1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach

'గోల్డ్​ స్మగ్లింగ్​తో నాకేం సంబంధం లేదు'- మాజీ పీఏ అరెస్టుపై శశిథరూర్​ రియాక్షన్! - Shashi Tharoor PA Arrest

ABOUT THE AUTHOR

...view details