Jharkhand Bus Accident : ఝార్ఖండ్‌లో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం హదారీబాగ్లో గురువారం ఉదయం 6 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
అదుపు తప్పి బోల్తా పడిన బస్సు - ఏడుగురు మృతి- 12మందికి గాయాలు - BUS ACCIDENT IN JHARKHAND
ఝార్ఖండ్‌లో అదుపు తప్పి బస్సు బోల్తా - ఏడుగురు మృతి - 12మందికి గాయాలు - ఉత్తర్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి,15మందికి గాయాలు
Published : Nov 21, 2024, 10:38 AM IST
ఉత్తర్‌ప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. అలీగడ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12 నుంచి ఒంటిగంట మధ్యలో ఈ ఘటన జరిగింది.
దిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి ఆజంగఢ్ వెళ్తున్న బస్సును ట్రక్కుడ్రైవర్ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు ముందున్నట్రక్కును బలంగా ఢీకొట్టింది. ట్రక్కులో గ్లాస్ మెటీరియల్ ఉందని పోలీసులు తెలిపారు. బస్సులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా గాయపడిన 15 మందిని చికిత్స కోసం సమీపంలోని జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.