తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకటే కులం- రోడ్డుకు అటువైపు SC- ఇటువైపు OBC- ప్రభుత్వ పథకాల్లోనూ ఎంతో తేడా! - రాజస్థాన్ పంజాజ్ సరిహద్దు రోడ్డు

Road Separated Two States : ఓ రహదారి రెండు గ్రామాలను వేరు చేస్తుంది. రెండు రాష్ట్రాలను కూడా విడదీస్తుంది. అయితే దానిలో ఏమి ఉందని అనుకుంటున్నారా? కులం ఒక్కటే కానీ కుల ధ్రువీకరణ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. అదొక్కటే కాదు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయలు అన్నింటిల్లోనూ వ్యత్యాసలు ఉంటాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దామా?

A Road Separated Two States
A Road Separated Two States

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 1:53 PM IST

ఒకటే కులం- రోడ్డుకు అటువైపు SC- ఇటువైపు OBC

Road Separated Two States: రోడ్డు ఒకటే కానీ ఇరువైపులా రెండు వేర్వేరు గ్రామాలు. అంతే కాదు విభిన్న రాష్ట్రాలు కూడా. ఓ వైపు ఉచిత కరెంటు, మహిళలకు బస్సు ప్రయాణాలు. మరో వైపు ఏమీ ఉండవు. రోడ్డుకు ఎడమవైపున మంచి మౌలిక సదుపాయాలు. కుడివైపున చెత్తచెదారంతో నిండిన రోడ్లు. ఒకటే కులం. కానీ వేర్వేరు కుల ధ్రువీకరణ పత్రాలు. పక్కనే ఉంటున్నా పిల్లల చదువులు, ఉద్యోగాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటిల్లోనూ తేడాలు ఉంటున్నాయి. అదే రాజస్థాన్​, పంజాబ్​ సరిహద్దులో ఉన్న ఖడ్వాంజా రోడ్డు.

ఒకటే కులం, రెండు వేర్వేరు సర్టిఫికేట్స్
ఖడ్వాంజా రోడ్డుకు ఒకవైపు రాజస్థాన్​లోని అలీపురా గ్రామం, మరోవైపు పంజాబ్​లోని దోదేవాలా గ్రామం ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు గ్రామ ప్రజలు ఓద్​ రాజ్​పుత్​ కులానికి చెందిన వారు. అయితే పంజాబ్​లో వీళ్లకి ఎస్​సీగా, రాజస్థాన్​లో ఓబీసీ కింద కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. దీంతో చదువులు, ఉద్యోగాల్లో రాజస్థానీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కాదు ప్రభుత్వాలు అందించే కొన్ని పథకాలు కూడా పొందటం లేదు. మరోవైపు పంజాబ్​లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి.

పేరు వినగానే డిస్​కనెక్ట్
ఇక అలీపురా గ్రామంలో మొబైల్ టవర్లు పంజాబ్​ పరిధిలో ఉన్నాయి. దీంతో ఏదైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అంబులెన్స్, పోలీసు కంట్రోల్ రూమ్​కు పోన్​ చేస్తే పంజాబ్​ ఏరియా అధికారులకు కాల్స్ వెళ్తున్నాయి. అలీపురా అని చెప్పాగానే కాల్​ను డిస్​కనెక్ట్ చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు కిలోమీటర్లు దూరం వెళితేగాని ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.

చెత్త, చెదారంతో అలీపురా
ఖడ్వాంజా రోడ్డుకు ఎడమ వైపున ఉన్న దోదేవాల గ్రామంలో రిజర్వాయర్​ నిర్మించారు. దీంతో ఏడాది పొడవునా నీరు కొరత లేకుండా ఉంటుంది. అలానే పశువులు, జంతువులు నీళ్లు తాగేందుకు ఘాట్​లను కూడా ఏర్పాటు చేశారు. అది లోతట్టు ప్రాంతం కావటం వల్ల వానలు కురిసినప్పుడు అలీపురా గ్రామంలోని నీరంతా అటువైపు వెళ్లిపోతున్నాయని గ్రామస్థులు అంటున్నారు. దీంతో సంవతర్సం అంతా రిజర్వాయర్ నీటితో నిండి ఉంటుందని తెలిపారు. కానీ అలీపురాలో సరైనా నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే అలీపురాలో ఎక్కడ చూసినా చెత్త, చెదారంతో ఉంటుంది. వ్యర్థాలతో వర్షపు నీరు కలవటం వల్ల కలుషితం అవుతున్నాయి. ఆ నీరంతా చెరువులోకి చేరటం వల్ల జంతువులు కూడా తాగవని గ్రామస్థులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని అలీపురా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దోదేలారా గ్రామంలోగా తమకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విదేశీయుడిని బెదిరించి క్యాబ్​ డ్రైవర్​ రూ.3.5 లక్షలు లూటీ- నెల రోజులుగా బిచ్చగాళ్లతోనే డచ్​ టూరిస్ట్​!

ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్

ABOUT THE AUTHOR

...view details