తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర ఉంగరాలు, లాకెట్లకు ఫుల్​ డిమాండ్​- ఎక్కడో తెలుసా?

Ram Mandir Gold Jewellery Demand : ఆయోధ్య రామమందిర రూపంలో ఉన్న బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇటువంటి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు భక్తులు మొగ్గు చూపుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన ఓ వ్యాపారి రామమందిర రూపంలో ఉన్న బంగారు ఆభరణాలను అమ్ముతున్నాడు. మరి ఆ కథేంటో ఓ సారి తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 1:20 PM IST

ram mandir gold jewellery demand
ram mandir gold jewellery demand

Ram Mandir Gold Jewellery Demand : అయోధ్యలో జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు రామమందిర రూపంలో తయారుచేసిన ఉంగరాలు, బంగారు ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన బంగారు వ్యాపారి ఆదిశ్ జైన్​ అయోధ్య రామాలయ రూపంలో ఉన్న అభరణాలను అమ్ముతున్నారు. మరో అసక్తికర విషమేమిటంటే ఆదిశ్​ జైన్​కు రామ​జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పంపింది.

రామాలయం రూపంలో బంగారు ఆభరణాలు

"ప్రస్తుతం దేశంలో వాతావరణం అంతా రామనామస్మరణతో నిండిపోయింది. ప్రస్తుతం ప్రజలు రామమందిర రూపంలో తయారుచేసిన నగలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రామమందిర నమూనా ఉంగరాలు, ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల మాకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. అయితే రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతే వారికి వస్తువులను అందించగలం. ఇప్పటికే పలు అభరణాలకు విక్రయించాం. ఆంజనేయ స్వామి లాకెట్లను సైతం అమ్ముతున్నాం. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ ట్రస్ట్​ ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానం అందుకున్న నేను చాలా అదృష్టవంతుడ్ని."
-- ఆదిశ్ జైన్​, బంగారం వ్యాపారి

ఆంజనేయ స్వామి

జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆభరణాలకు ఫుల్​ డిమాండ్ ఉందని ఆదిశ్ జైన్​ చెప్పారు. రామమందిర రూపంలో ఉన్న వెండి ఆభరణాలకూ మంచి గిరాకీ ఉందని అన్నారు. సాధారణంగా మెడలో వేసుకునే లాకెట్లు 5-10 గ్రాముల వరకు ఉంటాయని, తాము తయారుచేసినవి 15-25 గ్రాములని ఆదిశ్ తెలిపారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీరాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని అన్నారు. అందు కోసం ముందు తరాలు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేశాయని తెలిపారు.

రామయ్య రూపంలో బంగారు ఆభరణాలు
బంగారు ఆభరణాలు

దీపాలు వెలిగించి రాముడిపై అభిమానం
మరోవైపు, అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో వేలాది దీపాలను వెలిగించి శ్రీరాముడిపై అభిమానం చాటుకున్నారు. "సియావర్‌ రామచంద్ర కీ జై" అనే ఆకృతిలో వేలాదిగా దీపపు ప్రమిదలను వెలిగించారు. మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్‌, ఆయన కుటుంబసభ్యులు, కొందరు ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సార్వజనిక్ వచనాలయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముంబయిలోని ద సముద్ర వారధి బాంద్రా వోర్లీ సీ-లింక్‌పైనా శ్రీరాముని రూపంలో విద్యుత్​ దీపాలను ఏర్పాటు చేశారు.

సైక్లింగ్, వాకింగ్, స్కేటింగ్- అయోధ్యకు భక్తుల సాహసయాత్రలు- ఇతర మతస్థులు కూడా!

అయోధ్య రాముడి కోసం మోదీ ఉపవాసం- కొబ్బరి నీళ్లు సేవిస్తూ, నేలపై నిద్రిస్తూ కఠోర దీక్ష

ABOUT THE AUTHOR

...view details