ETV Bharat / bharat

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!

బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Supreme Court
Supreme Court (ANI)

Supreme Court On Child Marriage : బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. బాల్యంలో వివాహం చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది. బాల్య వివాహాలు మైనర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని నిర్దేశించింది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.