Cheque Bounce CaseRam Gopal Varma :చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబయి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.7లక్షల పరిహారం చెల్లించాలని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష- నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ - RAM GOPAL VARMA JAIL
చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష
Published : Jan 23, 2025, 4:23 PM IST
|Updated : Jan 23, 2025, 4:29 PM IST
2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. అయితే 2022 ఏప్రిల్‌లో రూ.5000 నగదు పూచీకత్తుతో కోర్టు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై గత ఏడేళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. రామ్‌గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం జనవరి 21న(మంగళవారం) రామ్‌గోపాల్ వర్మకు శిక్షను విధిస్తూ అంధేరీ మేజిస్ట్రేట్ వైపీ పూజారి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు.
అంధేరీ కోర్టు తీర్పుపై స్పందించారు వర్మ. "ఈ కేసు గురించి స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన రూ.2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున దీనిపై ఇంతకు మించి ఏమీ చెప్పలేను' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.