PM Modi Tour Across India : లోక్‌సభ ఎన్నికల నగారా మోగడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాల్లో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాగా పలు రాష్ట్రాల్లో రూ. లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బంగాల్, బిహార్, జమ్మూకశ్మీర్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, దిల్లీల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీ పది రోజుల షెడ్యూల్ ఇదే
- మార్చి 4 : తెలంగాణ అదిలాబాద్‌లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
అనంతరం తమిళనాడు కల్పకమ్లో ఉన్న భారతీయ నభికియా విద్యుత్ నిగం లిమిటెడ్ సందర్శించనున్నారు.
ఆదిలాబాద్, చెన్నైల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు.
- మార్చి 5: తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు.
ఆ తర్వాత ఒడిశాకు వెళ్లి చండీఖోలేలో బహిరంగ సభలో మాట్లాడతారు.
- మార్చి 6 : కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బరాసత్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తర్వాత బిహార్‌కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు.
- మార్చి 7 : జమ్మూకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం తిరిగి దిల్లీకి చేరుకొని ఓ మీడియా ఈవెంట్‌లో పాల్గొంటారు
- మార్చి 8 : దిల్లీలో తొలిసారిగా జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.