Interesting Facts About Pied Crow :కాకి ఒక నల్లని పక్షి. దీన్ని సంస్కృతంలో వాయసం అని అంటారు. సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కాకులు కనిపిస్తాయి. వీటిని ఎవరూ స్పెషల్గా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా కావ్ కావ్ అంటూ అరుస్తూ.. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే మెలగుతుంటాయి. అయితే, మనందరికీ కాకి గురించి ఈ విషయాలు మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పబోయే కాకి.. రంగులో మన చుట్టూ పక్కల తిరిగే కాకుల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వాటి కంటే పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ కాకి మాట్లాడగలదు.. పాటలు పాడగలదని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆ కాకి పేరు.. పైడ్ క్రౌ. ఇదీ చూడడానికి మామూలు కాకుల మాదిరిగానే నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ, మొత్తం బ్లాక్ కలర్లో ఉండదు. మెడ కింద, పై భాగం తెలుపు రంగులో ఉంటుంది. అంటే.. ముక్కు, కాళ్లు, రెక్కలు, తోక బ్లాక్ కలర్లో ఉండి.. మెడ కింద, పైన.. పొట్ట భాగం మాత్రం వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ పైడ్ క్రౌ ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే.. థాయ్‌లాండ్, గునియా వంటి దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది.
ఇది అన్నింట్లోనూ ఎక్కువే..!
పైడ్ క్రౌ కూడా మామూలు కాకుల మాదిరిగానే అన్ని ఆహారాలనూ తింటుంది. అంటే.. స్పెషల్గా ఒకే ఫుడ్ అని ఏమి తినదు. ఏది దొరికితే దాంతో బొజ్జ నింపుకుంటుంది. చిన్నచిన్న కీటకాలు, పక్షుల గుడ్లు, విత్తనాలు, పండ్లు, దుంపలు ఇలా అన్నింటినీ ఈ కాకి తింటుంది. ఇవి చిన్న గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఈ కాకి మన దగ్గర ఉండే కాకుల కంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది. పైడ్ క్రౌ ముక్కు, కాళ్లు కూడా పెద్దగానే ఉంటాయి.