రాజ్యసభ బుధవారం(జులై 3) ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
మోదీ ప్రసంగానికి అడ్డు- విపక్షాల తీరుకు వ్యతిరేకంగా తీర్మానం- లోక్‌సభ నిరవధిక వాయిదా - Parliament Session Live Updates - PARLIAMENT SESSION LIVE UPDATES
Published : Jul 2, 2024, 3:34 PM IST
|Updated : Jul 2, 2024, 8:40 PM IST
Parliament Session Live Updates :లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ప్రసంగించనున్నారు. సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన మోదీ, ఈ రోజు దానిపై స్పందించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం పెద్ద దూమారం రేపింది. దీనిపై అధికార పక్షం నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సహా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది.
LIVE FEED
ప్రధాని నేరంద్ర మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డు తగలడాన్ని ఖండిస్తూ ప్రవేశట్టిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. అనంతరం నిర్ణయించిన తేదీ కంటే ఒకరోజు ముందే లోక్‌సభ నిరవధిక వాయింది. జూన్ 24న లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
సైనికుల్లో ఆత్మనిర్భర్ కల్పించడమే మా లక్ష్యం: మోదీ
వాతావరణ కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం: మోదీ
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: మోదీ
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా భారత్‌ను మారుస్తాం: మోదీ
యువత భవిష్యత్తును నాశనం చేసే వారిని క్షమించబోం: మోదీ
పేపర్ లీక్‌ల విషయాన్ని అత్యంత తీవ్రంగా తీసుకుంటాం: మోదీ
నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తాం: ప్రధాని మోదీ
మన సైనిక వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తోంది: మోదీ
ఎవరి లాభం కోసం కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారు?: మోదీ
సైనిక వ్యవస్థలో వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానం తెచ్చాం: మోదీ
కరోనా కష్టకాలంలోనూ సైనికులను ఆదుకున్నాం: ప్రధాని మోదీ
మన సైనిక వ్యవస్థను కూడా విమర్శిస్తున్నారు: మోదీ
రక్షణరంగాన్ని ఆధునికీకరిస్తున్నాం: ప్రధాని మోదీ
రక్షణరంగంలో సమూల ప్రక్షాళన చేపట్టాం: ప్రధాని మోదీ
ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకునేలా సైనిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం: మోదీ
అవినీతి, కుంభకోణాలు లాంటి వ్యాఖ్యలు ఈ దేశంలో వినిపించకూడదు: మోదీ
భారత ధర్మం గొప్పదనం గురించి షికాగోలో వివేకానంద చెప్పారు: మోదీ
ప్రపంచ ప్రముఖుల ముందు మనదేశ ప్రతిష్ఠను వివేకానంద పెంచారు: మోదీ
హిందువులపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు: మోదీ
హిందువులు ఎప్పుడూ హింసకు వ్యతిరేకం: ప్రధాని మోదీ
హిందూ ఉగ్రవాదం అనే మాటను ప్రచారం చేస్తున్నారు: మోదీ
హిందువులను అవమానించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎప్పటికీ క్షమించరు: మోదీ
ఈ దేశంలోని ప్రతి వ్యక్తి.. ఈశ్వర రూపంగా హిందువులు భావిస్తారు: మోదీ
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి: మోదీ
భక్తిశ్రద్ధలతో పూజించే దేవీదేవతలనూ కాంగ్రెస్ నేతలు తూలనాడారు: మోదీ
కాంగ్రెస్ పెద్దల మనసులో ఒకటుంటే.. పైకి మరొకటి చెబుతారు..: మోదీ
ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో హింస రాజేసేందుకు ప్రయత్నించారు: మోదీ
కాంగ్రెస్ చేసిన రాజకీయాలు.. దేశహితం దిశగా ఏనాడూ లేవు..: మోదీ
కాంగ్రెస్ నేతలు తాము చేసిన తప్పులు గ్రహించడం లేదు: మోదీ
ఈ సభలో చిన్నపిల్లల చేష్టలు చూస్తున్నాం: ప్రధాని మోదీ
చిన్నపిల్లల చేష్టల నుంచి కాంగ్రెస్ నేతలు బయటకు రావాలి: మోదీ
ప్రజల సానుభూతి కోసం కాంగ్రెస్ కొత్త నాటకాలు మొదలుపెట్టింది: మోదీ
ఓబీసీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ దొంగలుగా చిత్రీకరిస్తోంది: మోదీ
వీర్ సావర్కార్‌పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు: మోదీ
చిన్నపిల్లల చేష్టలను ప్రజలు పట్టించుకోరని కాంగ్రెస్ గ్రహించాలి: మోదీ
బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ 26 శాతమే: మోదీ
ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల స్ట్రైక్‌రేట్ 50 శాతంగా ఉంది: మోదీ
16 రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ ఓట్ల శాతం దారుణంగా తగ్గింది: మోదీ
మిత్రపక్షాల సాయంతో కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంది: మోదీ
ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఫలితాలే వచ్చేవి: మోదీ
60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అరాచకంగా నడిచింది: మోదీ
దేశం నలుమూలలా కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది: మోదీ
భాషలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టింది: మోదీ
కాంగ్రెస్ పాలన వల్ల దేశం ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది: మోదీ
అర్థంపర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు: మోదీ
కాంగ్రెస్ నేతల వృథా ప్రయాసను దేశప్రజలు చూస్తున్నారు: మోదీ
99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు: మోదీ
కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు.. 543 సీట్లలో 99 వచ్చాయి..: మోదీ
వరుసగా మూడోసారి ఓడినా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పు రాలేదు: మోదీ
ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదు: మోదీ
ప్రజా తీర్పును గౌరవించాలని కాంగ్రెస్ నేతలను కోరుతున్నా: మోదీ
ఈ పదేళ్లలో మహిళాసంఘాలను బలోపేతం చేశాం: ప్రధాని మోదీ
3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాం: ప్రధాని మోదీ
వచ్చే ఐదేళ్లలో మూడింతల వేగంతో పనిచేస్తాం: ప్రధాని మోదీ
వచ్చే ఐదేళ్లలో దేశ ప్రజలకు మూడింతల ప్రయోజనం కలిగిస్తాం: మోదీ
మా పనులు బాగున్నాయనే ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారు: మోదీ
లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన 4 రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ విజయం సాధించింది: మోదీ
ఒడిశాలో జగన్నాథస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం: మోదీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి క్లీన్ స్వీప్ చేసింది: మోదీ
అనేక రాష్ట్రాల ప్రజలు భాజపా పాలనను కోరుకుంటున్నారు: మోదీ
కేరళలోనూ మా పార్టీ ఖాతా తెరిచింది: ప్రధాని మోదీ
తమిళనాడులోనూ గణనీయమైన ఓట్లు సాధించాం: మోదీ
మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ ప్రజలూ మావెంటే ఉన్నారు: మోదీ
ఈసారి కూడా కాంగ్రెస్‌ను పక్కనే కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు: మోదీ
మూడోసారి కూడా సభలో నినాదాలు చేయాలని కాంగ్రెస్‌కు చెప్పారు: మోదీ
ప్రజల నిర్ణయంపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మోదీ
ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇంకా శీర్షాసనాలు వేస్తున్నారు: మోదీ
గతంలో బొగ్గు విషయంలో అంతులేని అవినీతి జరిగేది: మోదీ
2014కు ముందు బొగ్గు కుంభకోణాలకు లెక్కే లేదు: మోదీ
మేం వచ్చాక బ్యాంకుల ప్రతిష్ఠను పెంచాం: మోదీ
ప్రపంచవ్యాప్తంగా మన బ్యాంకులపై విశ్వాసం పెరిగింది: మోదీ
2014కు ముందు దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు: మోదీ
2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది: మోదీ
2014లో మేం వచ్చాక తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాం: మోదీ
370 ఆర్టికల్ తొలగించాక అక్కడ శాంతిభద్రతలు మెరుగయ్యాయి: మోదీ
370 ఆర్టికల్ తొలగించాక జమ్ముకశ్మీర్‌లో రాళ్ల దాడులు తగ్గిపోయాయి: మోదీ
మేం వచ్చాక తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేశాం: ప్రధాని మోదీ
దేశం మరింత ముందుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ
దేశ ఆర్థిక వ్యవస్థను పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చాం: మోదీ
మనదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం: మోదీ
సెల్‌ఫోన్లను సొంతంగా తయారుచేసుకుంటున్నాం: మోదీ
చిప్పులు, సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించాం: మోదీ
పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం: ప్రధాని మోదీ
వికసిత్ భారత్ సాధించేవరకు పగలూరాత్రీ కృషి చేస్తాం: మోదీ
వికసిత్ భారత్ సాధిస్తామని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నా: మోదీ
2014లో దేశ ప్రజలంతా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు: మోదీ
2014కు ముందు ఏ పేపర్ చూసినా కుంభకోణాలే కనిపించేవి: మోదీ
గత ప్రభుత్వాల పాలనలో రూపాయిలో యాభై పైసలు అవినీతి జరిగేది: మోదీ
మా ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీ
గతంలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది: మోదీ
2014కు ముందు పేదలకు రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది: మోదీ
మా హయాంలో దేశంలో అనేక మార్పులు వచ్చాయి: మోదీ
ఎంతో నమ్మకం, ధైర్యంతో ప్రజలంతా మాకు అండగా నిలిచారు: మోదీ
మేం ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం: మోదీ
మా ప్రభుత్వ పథకాలు మారుమూల సామాన్యులకూ చేరుతున్నాయి: మోదీ
ఈ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పు ఇచ్చారు: మోదీ
140 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం: మోదీ
వికసిత్ భారత్ దిశగా మా సంకల్పంలో ఎలాంటి మార్పు ఉండదు: మోదీ
దేశం అభివృద్ధి చెందితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి: మోదీ
దేశాభివృద్ధితోనే భావితరాలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలం: మోదీ
మా పాలనలో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారాయి: మోదీ
ప్రధాని ప్రసంగానికి అడ్డుతగులుతున్న విపక్షాలు
ప్రతిపక్ష నేతను తీవ్ర స్వరంతో హెచ్చరించిన స్పీకర్ ఓంబిర్లా
సభను తప్పుదోవ పట్టించవద్దని రాహుల్‌ను హెచ్చరించిన స్పీకర్
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడంపై స్పీకర్ ఆగ్రహం
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదన్న స్పీకర్
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం
వికసిత్ భారత్ దిశగా రాష్ట్రపతి ప్రసంగం కొనసాగింది: మోదీ
వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు
రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు: మోదీ
సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే: మోదీ
దేశ ప్రజలంతా మావైపే ఉన్నారు: ప్రధాని మోదీ
పదేళ్ల మా పాలన చూసి ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారు: మోదీ
పదేళ్లలో 25 కోట్లమంది పేదలను దారిద్ర్యరేఖ నుంచి బయటకు తెచ్చాం: మోదీ
పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం: మోదీ
ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది: మోదీ
ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠ, గౌరవం పెరిగింది: మోదీ
భారత్ ప్రథమ్ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం: మోదీ
ఏ కార్యక్రమం చేపట్టినా భారత్ ప్రథమ్ కేంద్రంగానే తీసుకుంటాం: మోదీ