Find the Difference in DJ Tillu Square Photo: డీజే టిల్లు -2తో సిద్ధు ఎలాంటి హిట్ కొట్టాడో అందరికీ తెలిసిందే. టిల్లుగాడి డీజే సౌండ్‌కు బాక్సాఫీస్ బద్దలైపోయింది. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ జోడీ కిర్రాక్ గా ఉందని టాక్ వినిపించింది.
మార్చి 29న విడుదలైన ఈ చిత్రం వచ్చిన టిల్లు స్క్వేర్.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లోనూ దుమ్ము లేపింది. ఈ సినిమా వసూళ్లు సిద్ధును స్టార్ హీరోని చేశాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మరో 3 ఏళ్లలోనూ తాను 100కోట్ల క్లబ్లో చేరాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. కోరుకున్నట్టుగానే రెండేళ్లలోనే ఆ ఫీట్ సాధించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. అలాంటి పిక్స్లోంచి ఓ పిక్‌ను మీకోసం తీసుకొచ్చాం. ఇందులో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. మీరు 10 సెకన్లలో వీటిని కనిపెడితే మీరు టిల్లు అంత షార్ప్ అని ఒప్పుకోవాల్సిందే.
ఈ ఫొటోలోని 5 తేడాలను 10 సెకన్లలో మడత పెట్టేస్తే - మీకు కిర్రాక్ బ్రెయిన్ ఉన్నట్టే!