How To Make Onion Samosa in Telugu : ఎక్కువ మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్‌లో సమోసా ఒకటని చెప్పుకోవచ్చు. చాలా మంది బయట టీ తాగుతున్నప్పుడు, సినిమాకు వెళ్లినప్పుడు వీటిని టేస్ట్ చేస్తుంటారు. క్రిస్పీ క్రిస్పీగా ఉండి తింటుంటే కరకరలాడుతుంటాయి. చాలా రుచికరంగా అనిపిస్తాయి. అయితే, అలాంటిఉల్లి సమోసాలను(Samosa)ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా? పైగా టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మైదా - 1 కప్పు
- ఉల్లిపాయలు - 300 గ్రాములు
- కారం - అర టీస్పూన్
- గరం మసాలా - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - వేయించుకోవడానికి తగినంత
- వాటర్ - తగినన్ని
తయారీ విధానం :
- ముందుగా ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజ్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక క్లాత్‌పై పరచి కనీసం ఒక గంటపాటు గాలికి ఆరబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మైదా వేసుకోవాలి. తర్వాత తగినన్ని గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్‌గా మారిందనుకున్నాక.. కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- అనంతరం చపాతీ పీటపై కాస్త పొడి పిండి వేసుకొని ఆ ఉండలను కాస్త మందంగా ఉండేలా చిన్న సైజ్ చపాతీల్లా చేసుకోవాలి. అలా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి.
- తర్వాత వాటిపై కాస్త ఆయిల్ అప్లై చేసుకొని.. కొద్దిగా పొడి మైదా చల్లుకోవాలి.
- తర్వాత నాలుగు రోటీలను ఒకదానిపై ఒకటి ఉంచి పొడి పిండి చల్లుకుంటూ సాధ్యమైనంత వరకు మరోసారి రోల్ చేసుకోవాలి. అప్పుడు అది ఒక మందపాటి రోటీలా మారుతుంది.
- అనంతరం స్టౌపై ఒక మందపాటి పెనం పెట్టుకొని దానిపై ఆ రోటీని ఉంచి కాసేపు కాల్చుకోవాలి. అయితే, ఎక్కువ సేపు కాల్చుకోవద్దు. అలా చేస్తే అప్పడాల మాదిరిగా సమోసా షీట్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది.
- పెనం మీద కాల్చుకున్న రోటీని చపాతీ పీటపై ఉంచి స్కే ల్ సహాయంతో స్క్వేర్ షేప్‌లో ఉండేలా నాలుగు అంచులను కట్ చేసుకోవాలి.
- ఆపై స్క్వేర్ షేప్‌లో ఉన్న రోటీని సగానికి కట్ చేసుకోవాలి. అనంతరం వాటిని సమోసా సైజ్‌కు సరిపోయే విధంగా చిన్న చిన్న షీట్స్ చేసుకోవాలి.
- అయితే, ఈ ప్రాసెస్ అంతా పెనం మీద నుంచి తీసిన వెంటనే జరిగిపోయేలా చూసుకోవాలి. లేదంటే.. రోటీలను లాగినప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది.
- చిన్న చిన్న షీట్స్గా కట్ చేసుకున్నాక.. వాటిలో నుంచి ఒక్కొక్క లేయర్‌ను విడదీసుకోవాలి. అయితే.. విడదీసి ప్లేట్లో ఉంచే వాటిపై ఒక క్లాత్ కప్పుకోవాలి. లేదంటే.. అవి డ్రై అయిపోయి విరిగిపోతాయి.
- ఆవిధంగా అన్ని షీట్స్‌ను విడదీసి పక్కన పెట్టుకున్నాక.. ఇప్పుడు ఒక బౌల్లో ఆరబెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు షీట్స్ సీల్ చేయడం కోసం.. ఒక చిన్న బౌల్లో పావు కప్పు మైదా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్కని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.
- అనంతరం ఒక సమోసా షీట్‌ను చేతిలోకి తీసుకొని సరిగ్గా ట్రై యాంగిల్ వచ్చేలా మలుచుకోవాలి. ఆపై మళ్లీ ఇంకో మడత పెట్టుకోండి. ఇప్పుడు కోన్ మాదిరిగా అవుతుంది.
- అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అన్ని చివరలకు మైదా పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి.
- ఇలా మొత్తం షీట్స్ అయిపోయేంత వరకు సమోసాలు ప్రిపేర్ చేసుకుంటూ ప్లేట్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని కనీసం పావుగంట పాటు గాలికి ఆరనివ్వాలి.
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. నూనె హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కు మెయింటైన్ చేస్తూ సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆపై వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే.. క్రంచీగా, క్రిస్పీగా ఉండే నోరూరించే "ఆనియన్ సమోసాలు" మీ ముందు ఉంటాయి!