తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమిలి ఎన్నికలకు వీలుగా 3బిల్లులు తెచ్చేందుకు కేంద్రం రెడీ! బీజేపీ 'ఒకే' పాట పాడుతుందన్న DMK - One Nation One Election Bills

One Nation One Election Amendment Bills : జమిలి ఎన్నికల అమలుకు కేంద్రం కీలక పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన 3 బిల్లులను తీసుకురానుంది. వాటిలో 2 రాజ్యాంగ సవరణకు సంబంధిచినవిగా తెలుస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒక క్రమపద్దతిలో నిర్వహించేందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమెదానికి కనీసం 50 శాతం రాష్టాల అంగీకారం అవసరం కానుంది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అవలంభిస్తున్న వైఖరిపై డీఎంకే పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది.

One Nation One Election Amendment Bills
One Nation One Election Amendment Bills (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 7:01 PM IST

One Nation One Election Amendment Bills :దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'కు సంబంధించి, మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మూడింట్లో ఒక బిల్లుకు 50శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'కు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.

మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు
ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు- లోక్​సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించడం. అయితే, ఈ బిల్లుకు కనీసం 50 రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫారసులు పేర్కొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లులో ప్రతిపాదించే సవరణలు, నిబంధనలు ఇవే.

  • ఆర్టికల్ 83(2) సవరించడం.
  • లోక్​సభ వ్యవధి, దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్​-క్లాజ్​లు(2), (4)ని చేర్చడం
  • శాసనసభలను రద్దు చేయడం, 'ఏకకాల ఎన్నికలు'(simultaneous elections) అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ 327 సవరించడం

రెండో రాజ్యాంగ సవరణ బిల్లు
రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు, సవరణ నిబంధనలు ఉన్న ఈ బిల్లును కనీసం 50శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది.

  • స్థానిక సంస్థల ఎన్నికల కోసం, రాష్ట్ర ఎన్నికల కమిషన్​లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్​ రోల్​​ తయడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం
  • లోక్​సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా, కొత్తగా ఆర్టికల్ 342ఏ చేర్చడం.

మూడో బిల్లు
మూడో బిల్లు సాధారణ సవరణ బిల్లు. ఇందులో, లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉన్న దిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్, దిల్లీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలను ఉంటాయి. ఈ యూటీ అసెంబ్లీల నిబంధనలను, మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన- రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్​సభ నిబంధనలతో సరచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రతిపాదించిన సవరణలు ఇవే

  • గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ, 1991 చట్టాన్ని సవరించడం
  • గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్-1963ని సవరించడం
  • జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019ని సవరించడం

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మొత్తం 18 సవరణలు సిఫారసు చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్​లలో 12 కొత్త సబ్​ క్లాజ్​లను చేర్చడం. అసెంబ్లీలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సర్దుబాటు చేయడం ఉన్నాయి. అంతేకాకుండా మొదటి దశలో లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఆ తర్వాత 100 రోజులకు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్స్​ నిర్వహించాలని సూచించింది. ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి ఎలక్టోరల్​ రోల్ ఉండాలని హై లెవెల్ కమిటీ సూచించింది.

జమిలికి విపక్షాలు నో
జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామన్న బీజేపీ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అది సాధ్యం కాదంటూ చెబుతున్నాయి. అందులో ఒకడుగు ముందుకేసింది తమిళనాడు అధికార పార్టీ డీఎంకే. ఒకే దేశం- ఒకే ఎన్నిక ద్వారా బీజేపీ రాష్ట్రాలను తొక్కేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించింది. జమిలి ఎన్నిక సాధ్యం కాదని చెప్పింది.

'1951 ఇండియా, ఇప్పటి భారత్​ ఒకటేనా'
"1967 వరకు పార్లమెంటు, శాసనసభకు ఎన్నికలు కలిపి జరిగేవి. అయితే అప్పటి (1967) భారతదేశ జనాభా ఎంత? ఇప్పుడు జనాభా ఎంత? ఆనాటి భారతదేశం, నేటి భారతదేశం ఒకటేనా? ఆ రోజు ఓటర్ల సంఖ్య ఎంత? నేటి ఓటర్ల సంఖ్య ఎంత? ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 4000 ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. 1951లో మొత్తం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 1874, 2024 లోక్​సభ ఎన్నికల్లో 8,360మంది పోటీ చేశారు. ఆనాటి ఎన్నికలు, నేటి ఎన్నికలు ఒకటేనా? ప్రస్తుతం 90మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్​ అంసెబ్లీ ఎన్నికలే మూడు దశల్లో జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక అనడం సిగ్గుచేటు కాదా?" అని డీఎంకే ప్రశ్నల వర్షం కురిపించింది.

కేంద్రం 'ఒకే' పాట పాడుతోంది : DMK
"ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే సంస్కృతి, ఒకే పరీక్ష, ఒకే ఎన్నికలు, ఒకే పన్ను అంటూ అదే పాట పాడుతున్నారు. ఇది(ఒకే దేశం-ఒకే ఎన్నిక) అసాధ్యమైన సమస్యాత్మకమైన అంశం. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దీంతో ఏం జరుగుతుంది? అనేక రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం తగ్గుతుంది! రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంటుంది" అని డీఎంకే విమర్శించింది.

దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? ప్రభుత్వం ముందున్న సవాళ్లివే! - One Nation One Election India

'ఈ ఎలక్షన్స్​ వాళ్లకే ఉపయోగం - ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది' : జమిలి ఎన్నికలపై ఒవైసీ స్పందన

ABOUT THE AUTHOR

...view details