National Girl Child Day 2024 :బాలికలను కాస్త ప్రోత్సహిస్తే చాలు.. అద్భుతమైన విజయాలు సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆట పాటలు, క్రీడలు, కళలు.. ఇలా ఏ రంగంలో ప్రవేశించినా పతకాలు, బహుమతులు వారి సొంతం అవుతాయి. అయితే ఈ విజయాలు సాధించాలంటే బాలికలు ఆరోగ్యంగా ఉండాలి. కాగా, చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లల విషయంలో చేసే పొరపాట్లు ఏంటంటే.. "మన కళ్ల ముందు ఆడుతూ, పాడుతూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా" అని అనుకుంటారు. కానీ, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల కొన్ని రకాల లక్షణాలు కనిపించవకపోవచ్చని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలకు ఏటా కొన్ని రకాల టెస్ట్‌లను చేయించాలని చెబుతున్నారు. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీరు మీ అమ్మాయికి ఏదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ టెస్ట్‌లు చేయించమని సలహా ఇస్తున్నారు. మరి ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..
National Girl Child Day: సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడానికి.. అలాగే వారి హక్కుల కోసం పోరాడటానికి ప్రోత్సహించేలా 2008 నుంచి భారత ప్రభుత్వం.. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2015 జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో పథకం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 2024 ఏడాదికి ఇంకా థీమ్‌ను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ఎదిగే అమ్మాయిలకు చేయించాల్సిన పరీక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ):చాలా మంది అమ్మాయిలు రజస్వల అయిన తరవాత రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి సీబీపీ చేయించాలి. దీనివల్ల శరీరంలో బ్లడ్ శాతం, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ కౌంట్‌లు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా గుర్తించవచ్చు. అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపించి.. కారణం తెలుసుకోవడానికి కూడా సీబీపీ చేయించడం మంచిదని నిపుణులంటున్నారు.
స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉందా? - సమస్యలు తప్పవట!
విటమిన్ ప్రొఫైల్ పరీక్ష : ఎదిగే బాలికలకు విటమిన్ ప్రొఫైల్ పరీక్ష చేయంచడం ఎంతో ముఖ్యం. దీనివల్ల శరీరంలో విటమిన్ డి, బి12 స్థాయులు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండటంలో ఈ రెండు విటమిన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి వారి ఎముకలు, కండరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.