తెలంగాణ

telangana

ఎకరం భూమిలో 60 రకాల పంటలు సాగు - మల్టీలేయర్​ ఫార్మింగ్​తో ఏటా రూ.8లక్షలు సంపాదిస్తున్న యువరైతు! - Multi Layer Farming Model

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 8:34 PM IST

Multi Layer Farming : ప్రస్తుత కాలంలో రైతు ఎకరాల కొద్దీ భూమి ఉన్నా సరైన ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అయితే, మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువరైతు తనకున్న ఎకరం భూమిలోనే మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్ ద్వారా 60 రకాల కూరగాయలు, పండ్లు, పాదులను సాగుచేసి ఏటా రూ.7-8 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. మరెందుకు ఆలస్యం యువరైతు సాగు టెక్నిక్స్ ఏంటో చూద్దాం పదండి.

Multi Layer Farming
Multi Layer Farming (ETV Bharat)

ఎకరం భూమిలో 60 రకాల పంటల సాగు - రూ.8 లక్షల ఆదాయం (ETV Bharat)

Multi Layer Farming Model :శతాబ్దాల నుంచి సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నా రైతుకు సరైన ఆదాయం రావడం లేదు. ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల రైతు ఆదాయాన్ని పెంచుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల మధ్య మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన ఓ యువరైతు కేవలం ఎకరం భూమిలోనే 60 రకాల కూరగాయలు, పండ్లను సాగుచేస్తూ ఏటా రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఆదాయంలో ఇంజినీర్, డాక్టర్​కు తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్నాడు. వ్యవసాయంలో మల్టీ లేయర్ ఫార్మింగ్ టెక్నిక్​ను ఉపయోగించి రాణిస్తున్నాడు.

మల్టీ లేయర్ ఫార్మింగ్ (ETV Bharat)

ఏడాది పొడవునా రైతుకు ఆదాయం!
సాగర్ జిల్లాకు చెందిన ఆకాశ్ చౌరాసియా అనే యువరైతుకు ఎకరం భూమి ఉంది. 12 నెలల పాటు ఆదాయాన్ని సంపాదించడానికి అతడు మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్​ను రూపొందించాడు. అంటే తనకున్న భూమిలో కింద కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు. పైన పాదులు వంటివి సాగు చేస్తున్నాడు. దీంతో అతడికి ఏడాది పొడవునా ఆదాయం వస్తోంది. అదే సంప్రదాయ వ్యవసాయం చేస్తే ఏడాదికి రెండు పంటలే వస్తాయి. మల్టీ లేయర్ టెక్నిక్​తో ఏడాది మొత్తం వ్యవసాయం చేయవచ్చు. అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒకటి పంటకు చేతికి వస్తుంది. దీంతో రైతుకు ఆదాయం కూడా సమకూరుతుంది.

"దేశంలో రైతులు ఏడాదిలో రబీ, ఖరీఫ్ సీజన్​లో పంటలు వేస్తారు. అంటే ఏటా రెండు సార్లు మాత్రమే రైతులు ఆదాయాన్ని పొందుతారు. ఈ ఆదాయంతో ప్రస్తుత కాలంలో జీవితాన్ని గడపడం చాలా కష్టం. ఏడాది పొడవునా ఆదాయాన్ని అందించే వ్యవసాయం మోడల్​ను ఎందుకు ఎంచుకోకూడదు అనుకున్నాను. నేను ఒక ఎకరం భూమిలో 60 రకాల పంటలు వేశాను. వేసవిలో చాలా మంది రైతులు పంటలు పండిచరు. ఎందుకంటే సాగుకు సరిపడా నీరు ఉండదు. అందువల్ల నేను రూపొందించిన మల్టీ లేయర్ మోడల్ చిన్న రైతులకు 12 నెలల పాటు ఆదాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం నేను ఏడాదికి రూ.7 లక్షలు- రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాను. మల్టీ లేయర్ ఫార్మింగ్ వల్ల ఆకు కూరలు, పాదులు, పండ్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జింజవచ్చు. అల్లం , పసుపు వంటి వాటి ద్వారా సీజన్​తో సంబంధం లేకుండా ఏటా రాబడిని పొందొచ్చు."-ఆకాశ్ చౌరాసియా, యువ రైతు

మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్ ప్రకారం ఒక ఎకరంలో వ్యవసాయం చేయాలంటే దాదాపు రూ.లక్ష- రూ. లక్షన్నర వరకు ఖర్చువుతుంది. అంటే విత్తనాలు, దుక్కి దున్నడం, కూలీలు ఖర్చు ఇలాంటివన్ని ఈ వ్యయంలోనే జరుగుతాయి. ఒక్కసారి మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్ ప్రకారం సాగు చేస్తే 5-6 ఆరేళ్ల వరకు సాగు ఉంటుంది. అలాగే మంచి పంట మంచి దిగుబడి వస్తుంది. అన్ని పంటలు కలిపి 250-300 క్వింటాళ్ల వరకు పండుతాయి. దీంతో వాటి ధరలు ఆధారంగా ఏటా రూ.7 లక్షలు-రూ.7.5 లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు.

మల్టీ లేయర్ ఫార్మింగ్ (ETV Bharat)

'మంచి ఆదాయం రావాలంటే ఈ మోడల్ బెటర్'
"నేను ఈ ఏడాది ఫిబ్రవరిలో మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్ ఆధారంగా టమాటా, బెండకాయ, మిరప, పొట్లకాయ, దోసకాయ, దుంప పంటలు, ఆకు కూరలు, పాదులను సాగు చేసాను. అలాగే పండ్ల మొక్కలను వేశాను. దీంతో ఎకరం పొలంలో 60 రకాల పంటలను వేసినట్లైంది. పంట వేసిన 22 రోజుల తర్వాత నేను తొలి ఆదాయాన్ని పొందాను. జనవరిలో తప్పితే ఏడాది పొడవునా ఈ మోడల్ ద్వారా వ్యవసాయం చేస్తే ఆదాయాన్ని ఆర్జించవచ్చు." అని ఆకాశ్ చౌరాసియా వ్యాఖ్యానించారు.

మల్టీ లేయర్ ఫార్మింగ్ (ETV Bharat)

NAARM trains young scientists : యువ వ్యవసాయ శాస్త్రవేత్తల రూపకల్పనలో.. నార్మ్ శిక్షణ

'రైతుల నికర ఆదాయాలు పెరగాలంటే సెకండరీ అగ్రికల్చర్ అనివార్యం'

ABOUT THE AUTHOR

...view details