తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రేక్‌ఫాస్ట్‌లో సరికొత్త రెసిపీ - మనసు దోచే మూంగ్​ దాల్​ రోటీ! - moong dal cooking

Moong Dal Crispy Roti : చపాతీలను అందరూ రొటీన్‌గా చేస్తుంటారు. కానీ.. ఇవి క్రిస్పీ అండ్‌ టెస్టీగా ఉండాలంటే పెసరపప్పుతో ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోద్ది! మరి.. అందరికీ నచ్చే హెల్దీ మూంగ్‌ దాల్‌ క్రిస్పీ రోటీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Moong Dal Crispy Roti
Moong Dal Crispy Roti

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 4:40 PM IST

Moong Dal Crispy Roti :మనలో చాలా మందికి పెసర పప్పు అనగానే దాంతో చేసే పప్పు చారు మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. దీనితో అద్భుతమైన రోటీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండీ.. పోషకాలు ఎక్కువగా ఉండే పెసర పప్పుతో హెల్దీరోటీలను ప్రిపేర్‌ చేసుకుంటే.. ఇంట్లోని వారంతా సరికొత్త ఫీలవుతారు. ఒక్కసారి మీ ఇంట్లో ఈ మూంగ్‌ దాల్ క్రిస్పీ రోటీలను ట్రై చేసి చూడండి.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా లాగిస్తారు. అంతలా బాగుంటాయి ఈ రోటీలు! మరి.. వీటిని ఎలా ప్రిపేర్‌ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

మూంగ్‌ దాల్‌ క్రిస్పీ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • గోధుమ పిండి: 1 కప్పు
  • మూంగ్ దాల్: 1 కప్పు
  • రెడ్ చిల్లీ పౌడర్: 1 tsp
  • పసుపు: 1 tsp
  • కొత్తిమీర: 2-3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: రుచికి సరిపడా

మూంగ్ దాల్ రోటీ తయారు చేసే విధానం :

  • ముందుగా తీసుకున్న కప్పు పెసర పప్పును శుభ్రంగా కడగాలి.
  • తర్వాత పప్పును ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టాలి.
  • ఇప్పుడు పప్పును ప్రెషర్‌ కుక్కర్‌లో వేయాలి. ఇందులోకి పసుపు, తగినంత ఉప్పు, నీటిని యాడ్‌ చేసుకోవాలి.
  • పప్పు కుక్కర్‌లో రెండు నుంచి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.
  • తర్వాత పప్పును నీటి నుంచి వేరు చేయాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిలో టేబుల్‌ స్పూన్‌ కారం, చిటికెడు ఉప్పు, సరిపడ నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • తర్వాత చపాతీ ముద్దలోకి కొద్దిగా ఉడకబెట్టిన పెసరపప్పును వేసి రోటీలాగా చేయాలి.
  • వీటిని వేడి వేడి పెనం మీద కాస్త నెయ్యి గానీ లేదా ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
  • అంతే ఎంతో క్రిస్పీ అండ్‌ టేస్టీగా ఉండే మూంగ్‌ దాల్‌ రోటీ రెడీ.
  • ఈ రోటీలను బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.

పెసరపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు

  • పెసరపప్పు రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
  • ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • అలాగే కడుపులో మంట, వాయువులను తగ్గిస్తుంది.
  • రక్తపోటును తగ్గిస్తుంది.
  • ఇందులో ఉన్న పాలీఫెనాల్స్ వల్ల వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు, చర్మం మృదువుగా ఉంచటానికి ఉపయోగపడతాయి.
  • ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!

కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

ABOUT THE AUTHOR

...view details