Monkey hugs Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తన ఒడిలో ఓ కోతిని ఆప్యాయంగా నిద్రబుచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శశిథరూర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శశిథరూర్ ఒడిలో కోతి- హాయిగా నిద్రబుచ్చిన ఎంపీ!- ఫొటోలు చూశారా?
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో వానరం - ఫొటోలను షేర్ చేసిన ఎంపీ
Published : 15 hours ago
|Updated : 15 hours ago
అది అద్భుతమైన అనుభవం అంటూ శశి థరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు.' నేను బుధవారం ఉదయం గార్డెన్లో కూర్చొని న్యూస్ పేపర్‌ను చదుతువున్నా. ఆ సమయంలో ఒక కోతి ఎక్కడి నుంచో నేరుగా నా దగ్గరకు వచ్చి ఒడిలో ఎక్కి కూర్చుంది. నేను ప్రేమగా అరటి పళ్లు ఇచ్చా. ఆకలితో ఉన్న ఆ కోతి తినేసింది. తర్వాత నన్ను కౌగిలించుకుని ఛాతిపై తలను ఆన్చి నిద్రపోయింది. అయితే కొంత సేపటి తర్వాత నేను మెల్లగా లేచేందుకు ప్రయత్నించా. వెంటనే ఆ వానరం దూకి వెళ్లిపోయింది. ఇది నాకు గొప్ప అనుభూతి' అని శశిథరూర్ పేర్కొన్నారు.
'వన్య ప్రాణుల ఉన్న పట్ల చాలా గౌరవం ఉంది. కోతి దాడి చేస్తే రాబిస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందాను. కోతి నా దగ్గరకు వచ్చినప్పుడు దానిని బెదిరించలేదు. అది కూడా నాపై ఎటువంటి దాడి చేయలేదు. ఏమి జరగనందుకు నేను సంతోషిస్తున్నా' అని శశిథరూర్ ఎక్స్‌లో మరో పోస్ట్ పెట్టారు.