How to Make Mango Pakoda in Telugu : చాలా మందికి పకోడీ అనగానే.. ఉల్లిపాయ, చికెన్, పాలకూరతో చేసే రెసిపీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, అలాకాకుండా వేసవిలో విరివిగా దొరికే పచ్చిమామిడితో పకోడీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే మాత్రం.. ఇప్పుడే ఈ అదిరిపోయే రెసిపీని ట్రై చేయండి. పుల్లపుల్లగా ఉంటూ నోరూరించే పచ్చిమామిడి పకోడీని(Pakoda) పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! పైగా సమ్మర్ కాబట్టి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఇంకెందుకు ఆలస్యం పచ్చిమామిడి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి మామిడికాయ - ఒకటి
- శనగపిండి - ఒక కప్పు
- కారం - అర స్పూను
- పసుపు - చిటికెడు
- జీలకర్ర - ఒక స్పూను
- కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- సోడా ఉప్పు - చిటికెడు
- వేయించడానికి సరిపడా - ఆయిల్
'ఆలూ మాసాలా సాండ్విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్ టూ యమ్మీ' అనడం పక్కా!
పచ్చి మామిడికాయ పకోడీ తయారీ విధానం :
- ముందుగా ఒక పచ్చిమామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి చాలా సన్నగా తురుముకోవాలి.
- ఆ తర్వాత అందులోనే పైన పేర్కొన్న విధంగా శనగపిండి, కారం, పసుపు, జీలకర్ర, కొత్తిమీర తరగు, కరివేపాకుతో పాటు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అవసరమైనతే కొన్ని నీళ్లు కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. సాధారణంగా మామిడి తురుములోని నీళ్లు సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో ఆ విధంగా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
- ఆయిల్ హీట్ అయ్యాక తయారు చేసుకొని పెట్టుకున్న మామిడి తురుము మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అంతే.. నోరూరించే టేస్టీ టేస్టీ పచ్చి మామడికాయ పకోడీ రెడీ! ఆపై దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా టమాటా సాస్ లేదా కొత్తిమీర చట్నీతో వడ్డిస్తే తిన్నవాళ్లు ఆహా ఏమి రుచి అనడం పక్కా!
- సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా చెప్పుకునే మామిడితో చేసే ఈ పకోడీలు పుల్లపుల్లగా, కారంకారంగా ఉండటం వల్ల సాయంత్రం స్నాక్స్‌గా చేసి పెడితే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.
- వేసవిలో విరివిగా దొరికే పచ్చిమామిడితో కేవలం పకోడీ ఒక్కటే కాదు.. బోండాలు, గారెలు వంటి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి!
ఈ స్నాక్స్ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు! - Easy Egg Snack Recipes