Man Uses Google Maps to Track Thief : టెక్నాలజీ అభివృద్ధి చెందాక మన జీవితంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. నిత్య జీవితంలో చాలా పనులు సులభంగా మారిపోయాయి. ఎంతో విలువైన సమయం, వనరులు కోల్పోకుండా ఈజీగా పనులన్నీ జరిగిపోతున్నాయి. అంతకుముందు ఫోన్ చోరీ అయితే, దానిపైన ఆశలు వదుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ సాయంతో అతి తక్కువ సమయంలోనే పట్టుకుంటున్నాం. ఇలాంటి ఘటనే తమిళనాడులోని నాగర్కొయిల్లో జరిగింది. గూగుల్ మ్యాప్స్ సహాయంతో దొంగిలించిన ఫోన్, బ్యాగ్‌ను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
నాగర్కొయిల్కు చెందిన ఓ వ్యక్తి తిరుచ్చి వెళ్లేందుకు నాగర్‌కొయిల్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. నాగర్కొయిల్లో ఆదివారం తెల్లవారుజామున 1.43గంటలకు స్లీపర్ క్లాస్‌లో పడుకున్నాడు. అయితే, రైలులో ఎవరూ లేని సమయం చూసిన ఓ దొంగ, అతడి బ్యాగుతో పాటు ఫోన్‌ను దొంగిలించి తిరునెల్వేలి జంక్షన్లో దిగిపోయాడు. ఆ తర్వాత దీనిని గమనించిన బాధిత వ్యక్తి, వెంటనే తన కుమారుడికి సమాచారం అందించాడు. అయితే, అదృష్టవశాత్తు దొంగిలించిన ఫోన్లో లొకేషన్ ఆన్ చేయడం వల్ల దానిని ట్రాక్ చేయడం సులభమైంది.