Mamata Banerjee On Aadhar Card Deactivated :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee on bjp) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందని దీదీ విమర్శించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయడం లేదని ఆరోపించారు. బీర్‌భూమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ప్రజా పంపిణీ కార్యక్రమంలో సీఎం మమతా ఈ మేరకు ఆరోపణలు చేశారు. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ అర్హులైన వారికి తమ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.
'ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి'
'ప్రజలందరూ ఆధార్ కార్డులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వమే (mamata banerjee on central government) కోరింది. స్కూల్ అడ్మిషన్ పొందాలన్నా ఆధార్ కార్డు అవసరమైంది. ప్రస్తుతం అదే ప్రభుత్వం మీకు ఎలాంటి సమాచారం అందించకుండానే ఆధార్ కార్డులను డీ యాక్టివేట్ చేస్తోంది. మీరంతా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వాటిని డీలింక్ చేస్తోంది. అయితే రాష్ట్రంలోని ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలను దూరం చేయబోం' అని మమతా బెనర్జీ తెలిపారు. ఆధార్ కార్డులు డియాక్టివేట్ అయిన వారు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఆ పోర్టల్‌లో ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసుకునే విధంగా ఉండాలని సీఎస్‌కు సూచించారు.