Discount For Mumbai Voters :మహారాష్ట్రలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలో ఓటు వేసిన వారికి రెస్టారెంట్లు, హోటళ్లు, స్టోర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చేలా చర్చలు జరిపి ఒప్పించారు. పోలింగ్ జరిగే 20వ తేదీతో పాటు మరో 2 రోజులు ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా చుక్క గుర్తును చూపిస్తే డిస్కౌంట్ ఆఫర్ పొందచ్చని పెద్ద పెద్ద సంస్థలు ప్రకటించాయి. ఇలాంటి డిస్కౌంట్ల వల్ల ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది.
ఓటేస్తే రెస్టారెంట్లు, హోటళ్లు, మల్టీప్లెక్స్‌ల్లో స్పెషల్ డిస్కౌంట్స్- ముంబయి ఓటర్లకు బంపర్ ఆఫర్!
ముంబయి ఓటర్లకు బంపర్ ఆఫర్- ఓటేస్తే డిస్కౌంట్లే డిస్కౌంట్లు!
Published : Nov 9, 2024, 4:50 PM IST
ఓటు వేయ్ డిస్కౌంట్ పట్టు!
ఓటు వేయ్ డిస్కౌంట్ పట్టు ఇనిషియేటీవ్‌ను విజయవంతం చేసేందుకు అక్టోబర్ 31వ తేదీన బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సహా ఈసీ అధికారులు రెస్టారెంట్లు, ట్రేడర్లు, మల్టీప్లెక్స్‌ల సంఘాలతో చర్చలు జరిపారు. PVR ఐనాక్స్, సినీపోలిస్, మిరేజ్, స్టెర్లింగ్, ముక్త, మూవీమ్యాక్స్, మూవీ టైమ్‌లు నవంబర్ 20, 21, 22 తేదీల్లో ఓటర్లకు 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు అంగీకరించాయి. హోటళ్లు, రిటైల్ వ్యాపారుల సంఘాలు కూడా 20, 21వ తేదీల్లో 10 నుంచి 20 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నాయి. రిలయన్స్ రిటైల్ ఔట్‌లెట్లలో కూడా 20న డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని సంస్థ ప్రకటించింది.
అటు ఉత్సవ్ నివద్నుకిచా, అభిమాన్ మహారాష్ట్రచా థీమ్‌తో ప్రజలకు ఓటింగ్ ప్రాముఖ్యంపై అవగాహన క్యాంపెయిన్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటింగ్‌ను పెంచేందుకు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఈసీ ప్రచారం కూడా చేయిస్తోంది. వర్షా ఉస్గోంకర్, మోహన్ జోషి, రోహిత్ శెట్టి, అజింక్యా రహానే వంటి సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, క్రికెటర్లను ఇప్పటికే ప్రచారంలో భాగం చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ పెంచేందుకు పలు సంస్థలు స్వచ్ఛందంగా రాయితీలను ప్రకటించాయి. కాగా 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23వ తేదీన ఫలితాలు రానున్నాయి.