తెలంగాణ

telangana

లోక్​సభ రెండో విడత- 3గంటల వరకు అసోంలో 60.32%, కర్ణాటకలో 50.93 శాతం పోలింగ్ - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 6:38 AM IST

Updated : Apr 26, 2024, 4:03 PM IST

Lok Sabha Elections 2024 phase 2 Live Updates : లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది.

Lok Sabha Elections2024 phase 2 Live Updates
Lok Sabha Elections2024 phase 2 Live Updates

04.01 PM

మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ శాతం వివరాలు ఇలా

అసోం 60.32%

బిహార్ 44.24%

ఛత్తీస్‌గఢ్ 63.32%

జమ్ముకశ్మీర్ 57.76%

కర్ణాటక 50.93%

కేరళ 51.64%

మధ్యప్రదేశ్ 46.50%

మహారాష్ట్ర 43.01%

మణిపుర్ 68.48%

రాజస్థాన్ 50.27%

త్రిపుర 68.92%

ఉత్తర్​ప్రదేశ్ 44.13%

బంగాల్ 60.60%

02.38 PM

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్‌

మధ్యాహ్నం 1కు నమోదైన పోలింగ్‌ శాతాలు

  • అసోం 46.31
  • బిహార్‌ 33.80
  • ఛత్తీస్‌గఢ్‌ 53.09
  • జమ్ముకశ్మీర్‌ 42.88
  • కర్ణాటక 38.23
  • కేరళ 39.96
  • మధ్యప్రదేశ్‌ 38.96
  • మహారాష్ట్ర 31.77
  • మణిపుర్‌ 54.26
  • రాజస్థాన్‌ 40.39
  • త్రిపుర 54.47
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 35.73
  • బంగాల్‌ 47.29

12:30 AM

వివిధ రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతం ఇలా

  • అసోం 27.43%
  • బిహార్ 21.68%
  • ఛత్తీస్‌గఢ్ 35.47%
  • జమ్ముకశ్మీర్ 26.61%
  • కర్ణాటక 22.34%
  • కేరళ 25.61%
  • మధ్యప్రదేశ్ 28.15%
  • మహారాష్ట్ర 18.83%
  • మణిపుర్ 33.22%
  • రాజస్థాన్ 26.84%
  • త్రిపుర 36.42%
  • ఉత్తర్​ప్రదేశ్ 24.31%
  • బంగాల్ 31.25%

10:30 AM

వివిధ రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతం ఇలా

  • త్రిపుర - 16.65
  • బంగాల్​- 15.68
  • ఛత్తీస్​గఢ్- 15.42
  • కర్ణాటక- 9.21
  • రాజస్థాన్​- 12
  • అసోం- 9.15

09:30 AM

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఓటు వేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓ పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి సరాసరి పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తిరువనంతపురంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్ ఓటు వేశారు. కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ అలప్పుజ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. బెంగళూరులో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

08:30 AM

13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. త్రిస్సూర్‌లో ఎన్‌డీఏ అభ్యర్థి, ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరలందరూ వచ్చి ఓటు వేయాలని పట్టణ ప్రజల ఓటింగ్‌ తక్కువగా నమోదవుతోందని అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ నేత వసుంధర రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలో కేంద్రమంత్రి మురళీధరన్‌ ఓటు వేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌, దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కూడా బెంగళూరులో ఓటు వేశారు

7:00 AM

ప్రారంభమైన పోలింగ్
దేశంలో రెండో విడత పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్​ ముగియనుంది. రెండో దశలో మొత్తం 15.88కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 మంది మహిళలు, 5,929 ఇతరులు ఉన్నారు. రెండో దశ బరిలో 1,202 అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, సీనియర్​ నటి హేమమాలిని వంటి ప్రముఖులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్​ 1 ముగియనుంది. జూన్​ 4న కౌంటింగ్ జరగనుంది.

Lok Sabha Elections 2024 phase 2 Live Updates :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88స్థానాలకు మరికాసేపట్లో ఓటింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్‌ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌ 13,మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదు చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లో మూడుచొప్పున, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కోస్థానానికి ఓటింగ్‌ జరగనుంది.

కేరళలో త్రిముఖ పోరు
కేరళలోని మొత్తం 20స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరగనుండగా, మొత్తం 194మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF, సీపీఎం సారథ్యంలోని LDF, బీజేపీ సారథ్యంలోని NDA మధ్య త్రిముఖపోరు నెలకొంది. కేరళలో 2.77కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు పొందినవారు ఉన్నారు. వారి కోసం 25,231 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసిన ఈసీ, ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 66వేలకుపైగా భద్రతాదళాలను మోహరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని UDF 19 స్థానాలు గెలుపొందగా సీపీఎం నేతృత్వంలోని LDF ఒక్క స్థానానికే పరిమితమైంది.

కర్ణాటకలో కాంగ్రెస్​ గట్టి పోటీ
కర్ణాటకలో మొత్తం 28లోక్‌సభ సీట్లు ఉండగా 14స్థానాలకు మరికాసేపట్లో ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 247 మంది పోటీ చేస్తున్నారు. ఈ విడతలో 2.88కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 30వేల 602 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ 14చోట్ల పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 11, ఎన్​డీఏ భాగస్వామి జేడీఎస్‌ 3 స్థానాల్లో బరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14స్థానాలకుగాను బీజేపీ 11 చోట్ల , ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఒక చోటు నెగ్గారు. అప్పుట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ చెరో లోక్‌సభ స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ ఈసారి గట్టిపోటీ ఇస్తోంది.

రాజస్థాన్​ ఎవరిదో
రాజస్థాన్‌లో మొత్తం 25స్థానాలు ఉండగా తొలి దశలో 12 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ విడతలో 13నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 152మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో ఇద్దరు కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తదితరులు ఉన్నారు. రెండోవిడత పోలింగ్‌తో కేరళ, రాజస్థాన్‌, త్రిపురలో ఎన్నికలు పూర్తవుతాయి.

శుక్రవారం పోలింగ్‌ జరగనున్న 88స్థానాలకు సంబంధించి 2019లో ఎన్డీయే 56 సీట్లు గెలుపొందగా ఇప్పుడు ఇండియా కూటమిగా పిలుస్తున్న అప్పటి యూపీఏ 24 చోట్ల విజయం సాధించింది. ఈ నెల 19న 102 స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో 65 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైంది.

Last Updated : Apr 26, 2024, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details