Kharge Comments On Modi :అబద్ధాలు ప్రచారం చేయడమే ప్రధాని మోదీ గ్యారంటీ అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో మోదీ కాంగ్రెస్‌ను నిందిస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రైతుల కష్టాలు వంటి అంశాల గురించి ఆయన(మోదీ) ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఈ విషయాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఖర్గే ఆరోపించారు. అలాగే బుధవారం పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ 'బ్లాక్ పేపర్'ను విడుదల చేశారు ఖర్గే.
'ప్రజాస్వామానికి ప్రమాదం'
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'బ్లాక్ పేపర్'ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఖర్గే. 'దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం పొంచి ఉంది. గత 10 ఏళ్లల్లో బీజేపీ 411 ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇది కూల్చేసింది. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది' అని బీజేపీపై ఫైర్ అయ్యారు.
తన పదేళ్ల పాలనపై గురువారం 'వైట్‌పేపర్'ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన్నామని కేంద్రంలోని అధికార బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ శ్వేతపత్రాన్ని సమర్పిస్తామని వెల్లడించారు. 2014 ముందు వరకు, ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మధ్య తేడాను వెల్లడించే ఉద్దేశంతో దానిని పార్లమెంట్‌లోని ఉభయ సభల ముందు ఉంచుతామన్నారు. దాని ద్వారా గత పాలనలో లోపాలను ఎత్తిచూపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.