తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ లాటరీలో కనకవర్షం- రూ. 20కోట్లు గెలుచుకున్న అజ్ఞాతవ్యక్తి! - కేరళ లాటరీ విజేతల వివరాలు

Kerala Lottery Result Today : కేరళలో ఓ వ్యక్తికి రూ. 20 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్​- న్యూ ఇయర్ బంపర్ కేరళ లాటరీలో అతడికి ఈ అదృష్టం వరించింది. ఇంకో 20 మంది రూ. కోటి చొప్పున గెలుచుకున్నారు.

Kerala Lottery Result Today
Kerala Lottery Result Today

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 10:00 PM IST

Kerala Lottery Result Today : కేరళలో ఓ వ్యక్తి రూ.20 కోట్ల జాక్​పాట్ గెలుచుకున్నాడు. క్రిస్మస్- న్యూ ఇయర్ సందర్భంగా లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ అదృష్టం వరించింది. బంపర్ కేరళ లాటరీ పేరుతో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్​మెంట్ అమ్మింది. తాజాగా తీసిన లాటరీ డ్రాలో విజేతలను ఆ సంస్థ ప్రకటించింది. తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్​కు చెందిన దురైరాజ్​ అనే వ్యక్తి.. ఈ రూ.20 కోట్ల విన్నింగ్ టికెట్​ను ఓ వ్యక్తికి విక్రయించాడు. ఈ లాటరీలో గెలుపొందిన వ్యక్తి టికెట్​ నంబర్ XC 224091 అని నిర్వాహకులు ప్రకటించారు . అయితే, ఇది ఎవరు కొన్నారన్నది ఇంకా తెలియరాలేదు.

రెండో బహుమతిగా రూ.కోటి
తాజా డ్రాలో మరో ఇరవై మంది రెండో బహుమతిని గెలుచుకున్నారు. వీరికి ఒక్కోక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేస్తారు. 30 మందికి మూడో బహుమతి వరించింది. వీరికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తారు. క్రిస్మస్​-న్యూ ఇయర్ బంపర్ లాటరీ టికెట్ ధరను రూ. 400కు విక్రయించారు . గతంలో బంపర్ కేరళ లాటరీ మొదటి బహుమతి రూ. 16 కోట్లుగా ఉండేది. బంపర్ డ్రాలో మొత్తం 45 లక్షల పైచిలుకు టికెట్లు అమ్ముడయ్యాయి. పాలక్కడ్​లో అత్యధికంగా టికెట్​లు అమ్మడయ్యాయని కేరళ లాటరీ డైరెక్టర్​ అబ్రహం రెన్ వెల్లడించారు.

బంపర్​ డ్రాలో రెండో బహుమతి పొందిన వారి నంబర్లు
XE 409265, XH 316100, XA 424481, XH 388696, XL 379420, XA 324784, XG 307789, XD 444440, XD 311505, XA 465294, XD 314511, XC 483413, XE 398549, XK 1 05413, XE 319044, XD 279240, XJ 103824, XE 243120, XD 378872 and XL 421156

తమిళనాడుకు వ్యక్తికి రూ.25 కోట్ల భారీ జాక్​పాట్
గతేడాది తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన ఓ వ్యక్తికి రూ.25 కోట్ల భారీ లాటరీ తగిలింది. ఓనం సందర్భంగా కేరళ ప్రభుత్వం తీసిన లాటరీలో టికెట్ నంబర్​ టీఈ 230662 కొన్న గోకులం నటరాజ్​ అనే వ్యక్తి మొదటి విజేతగా నిలిచాడు. ఈ టికెట్​ను పాలక్కడ్​లోని వలయార్ డ్యామ్​ సమీపంలోని భవ ఏజెన్సీ విక్రయించింది. ఈ 25 కోట్లలో 30 శాతం ట్యాక్స్​ పోగా రూ. 17.5 కోట్లు అతడు అందుకున్నాడు. ఈ బంపర్ లాటరీలో గెలిచిన వ్యక్తులు డ్రా తీసిన తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్ చేసుకోవాలి. రూ.5వేల లోపు బహుమతి అయితే.. నేరుగా లాటరీ కొనుగోలు చేసిన షాపునకు వెళ్లి తీసుకోవాలి. అంతకుమించిన నగదు అయితే.. వారి టికెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ కార్యాలయాల్లో ఇచ్చి నగదు తీసుకోవాలి. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

సామాన్యుడికి జాక్​పాట్​.. రూ.25కోట్లు గెలుచుకున్న తమిళనాడు వాసి

కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.12కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వాసి!

ABOUT THE AUTHOR

...view details