తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1,484 మంది కళాకారులతో కథక్ నృత్యం- 20నిమిషాల ప్రదర్శనతో గిన్నిస్ రికార్డ్ - ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ 2024

Kathak Dance World Record : ఒకే సమయంలో 1484 కళాకారులు కలిసి కథక్ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు. ఖజురాహోలో జరిగిన 50వ డ్యాన్స్ ఫెస్టివల్​లో ఈ ఘనతను సాధించారు.

Kathak Dance World Record
Kathak Dance World Record

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 10:51 AM IST

గిన్నిస్​ వరల్డ్ రికార్డ్​లో కథక్ నృత్యం - ఒకేసారి 1484 కళాకారులతో ప్రదర్శన

Kathak Dance World Record: ఒకేసారి 1,484 మంది కళాకారులు కలిసి కథక్ నృత్యం చేసి గిన్నిస్​ వరల్డ్ రికార్డును సాధించారు. మధ్యప్రదేశ్​లోని ఖజురాహోలో ఘనంగా జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్​లో కళాకారులు అందరూ కలిసి 20 నిమిషాల పాటు కథక్ నృత్యం ఈ రికార్డ్​ను సృష్టించారు. అయితే నెల క్రితం గ్వాలియర్​లోనే తాన్సేన్ సమారోహ్​ ఆధ్వర్యంలో జరిగిన తాల్ దర్బార్​ కార్యక్రమంలో 1,282 మంది తబలా కళాకారులు గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు.

కథక్ నృత్యం చేస్తున్న కళాకారులు

20 నిమిషాల ప్రదర్శన
ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ఖజూరాహోలో ఫిబ్రవరి 20న 50వ డ్యాన్స్ ఫెస్టివల్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు వచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా 1484 మంది కళాకారులు కలిసి ఏకరూప దుస్తుల్లో దేవాలయ ప్రాంగణంలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 'రాగ బసంత్​' అనే పాటకు సుమారు 20 నిమిషాలు నృత్యం చేశారు. వారిలో రాష్ట్రం​లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు. వారితో పాటు విదేశీ కథక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో జబలపుర్​కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు.

కథక్ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్​ రికార్డ్

వర్చువల్​ ప్రాక్టీస్
ఈ నృత్య ప్రదర్శన కోసం దాదాపుగా నెల రోజుల నుంచి కళాకారులు ప్రాక్టీస్​ చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల వర్చువల్​గా సాధన చేశారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్షలకు సిద్ధమవుతూనే మరో పక్క కథక్​ నృత్యాన్ని ప్రాక్టీస్​ చేశారు.

జానపద కళల శిక్షణ కోసం గురుకులం ఏర్పాటు
ఈ కార్యక్రమంలో కథక్ నృత్యం చేసి వరల్డ్ రికార్డు సాధించిన నృత్య కళాకారులను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు. 'ఖజురహోలో గిరిజన, జానపద కళల శిక్షణ కోసం దేశంలోనే తొలి గురుకులాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ గురుకులం గ్రామీణ సమగ్ర అభివృద్ధితో పాటు సాంప్రదాయ నైపుణ్యాలను రక్షించే విధంగా రూపొందుతుంది. దీనితో పాటు మన పూర్వీకుల వారసత్వం కూడా కాపాడుకుంటాం. ఈ నృత్యం భారతీయ సంస్కృతికి గర్వకారణంగా, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి తెలిపారు.

డ్యాన్స్ ఫెస్టివల్​లో కళాకారుల నృత్య ప్రదర్శనలు

ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు- న్యూఇయర్ రోజున గుజరాత్ గిన్నిస్ రికార్డ్

'మెమొరీ' మ్యాన్ అభయ్​- 3 గిన్నిస్​ రికార్డులు కైవసం- ఒక్క నిమిషంలోనే!

ABOUT THE AUTHOR

...view details