తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెకానిక్​కు జాక్​పాట్- లాటరీలో రూ.25 కోట్లు- 15 ఏళ్లుగా ట్రై చేస్తుంటే! - ONAM BUMPER LOTTERY

కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్​కు జాక్​పాట్- ఓనం బంపర్​ డ్రాలో రూ.25 కోట్లు

Thiruvonam Bumper lottery
Thiruvonam Bumper lottery (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 9:29 PM IST

Onam Bumper lottery : కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్​కు అదృష్టం వరించింది. కేరళలో ఓనం సందర్భంగా కొనుగోలు చేసిన లాటరీ టికెట్​తో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
మైసూరులోని పాండవపురానికి చెందిన అల్తాఫ్​ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్నాడు. కానీ ఎప్పుడూ జాక్​పాట్​ రాలేదు. అయితే ఓనం సందర్భంగా కేరళలో ఉన్న తన స్నేహితుడు ఎస్​జే ఏజెన్సీ వద్ద అల్తాఫ్​ పేరు మీద ఒక టికెట్​ను కొన్నాడు.

తాజాగా తీసిన లాటరీ డ్రా విజేతలను ప్రకటించారు. అందులో అల్తాఫ్​ కొన్న టికెట్ నంబర్ TG43222కి మొదటి బహుమతి వచ్చిందని వెల్లడించారు. లాటరీ ద్వారా వచ్చిన నగదును తన ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తానని అల్తాఫ్ తెలిపాడు. అలాగే తన కుమార్తె పెళ్లికి ఉపయోగిస్తానని చెప్పాడు. ఈ డ్రాలో మరో ఇరవై మందికి రెండో బహుమతి గెలుచుకున్నారు. ఒక్కొక్కరికి రూ.2కోట్లు బహుమతి వరించింది. మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు చొప్పున గెలుచుకున్నారు. మొత్తం 71 లక్షల పైగానే టికెట్లు అమ్ముడైనట్లు కేరళ లాటరీ డైరెక్టర్ అబ్రహం తెలిపారు. పాలక్కడ్​లో అత్యధికంగా టికెట్​లు అమ్మడయ్యాయని వెల్లడించారు.

తుక్కు అమ్ముకునే పెద్దాయనకు జాక్​పాట్!
ఇటీవలపంజాబ్​కు చెందిన ఓ స్క్రాప్​ డీలర్​ను అదృష్టం వరించింది. రూ.500తో కొన్న లాటరీ టికెట్ కోటీశ్వరుడిని చేసింది. రాఖీ సందర్భంగా కొన్న లాటరీ టికెట్ ద్వారా ఏకంగా రూ. 2.5 కోట్లు గెలుచుకున్నారు. జలంధర్ జిల్లాలోని ఆదమ్​పుర్​కు చెందిన ప్రీతమ్ లాల్ జగ్గీ(67) స్క్రాప్ డీలర్​గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఆయనకు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. రాఖీ సందర్భంగా రూ.500తో ఓ లాటరీ టికెట్​ను తన భార్య అనీతా జగ్గీ పేరు మీద కొన్నారు. ఈసారి ఆయన్ను అదృష్టం వరించి రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు. అయితే ముందుగా తన నంబర్ లాటరీ 452749 నంబర్​ను న్యూస్​ పేపర్​లో చూసి నమ్మలేదని, లాటరీ ఏజెంట్ ఫోన్ చేస్తే నమ్మకం కలిగిందని జగ్గీ చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details