తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ఎగ్జిట్ పోల్స్​ - బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికే పట్టం!

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా - మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్​లో NDA కూటమికే పట్టం!

Jharkhand Exit Polls
Jharkhand Exit Polls (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Jharkhand Exit Polls 2024 :ఝార్ఖండ్‌లో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేశాయి. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరిగింది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రయత్నించగా, మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం, ప్రజల మొగ్గు ఎన్​డీఏ కూటమి వైపే ఉందని చెబుతున్నాయి.

  • ఎన్డీయే కూటమికి 46 నుంచి 58 సీట్లు, జేఎంఎం నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమికి 24 నుంచి 37 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.
  • 42 నుంచి 47 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ సంస్థ పేర్కొంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి 25 నుంచి 30 చోట్ల, ఇతరులు 1 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
  • ఎన్డీయే కూటమికి 40 నుంచి 44, జేఎంఎం నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమికి 30 నుంచి 40 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ-జేవీసీ అంచనా వేసింది. ఇతరులు 1 నుంచి రెండు చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
  • ఇదిలా ఉండగా, కాషాయ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు చాణక్య స్ట్రాటజీస్‌ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 45 నుంచి 50 స్థానాలు, జేఎంఎం కూటమికి 35 నుంచి 38 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

కాంగ్రెస్​కూ విన్నింగ్​ ఛాన్స్ ఉంది!

  • మరోవైపు యాక్సిస్-మైఇండియా, పీ-మార్క్ సంస్థలు మాత్రం జేఎంఎం నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమికి మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. జేఎంఎం కూటమి 53, ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని యాక్సిస్-మైఇండియా పేర్కొంది. ఇతరులు 3 చోట్ల గెలుస్తారని తెలిపింది.
  • 37 నుంచి 47 స్థానాల్లో జేఎంఎం కూటమి, 31 నుంచి 40 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని పీ-మార్క్ అంచనా వేసింది. ఇతరులు 1 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

హంగ్ ఏర్పడవచ్చు!

  • దైనిక్ భాస్కర్‌ హంగ్‌ ఏర్పడుతుందని అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 37 నుంచి 40 జేఎంఎం కూటమికి 36 నుంచి 39 ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

Jharkhand Exit Polls 2024 :

పీపుల్స్‌ పల్స్‌

  • బీజేపీ+ ప్లస్‌ 46-58
  • జేఎంఎం+ 24-37
  • ఇతరులు 6-10

మ్యాట్రిజ్‌

  • బీజేపీ+ 42-47
  • జేఎంఎం+ 25-30
  • ఇతరులు 1-4

టైమ్స్‌నౌ-జేవీసీ

  • బీజేపీ+ 40-44
  • జేఎంఎం+ 30-40
  • ఇతరులు 1-2

చాణక్య స్ట్రాటజీస్‌

  • బీజేపీ+ 45-50
  • జేఎంఎం+ 35-38
  • ఇతరులు 3-5

యాక్సిస్‌-మైఇండియా

  • బీజేపీ+ 25
  • జేఎంఎం+ 53
  • ఇతరులు 3

పీ-మార్క్‌

  • బీజేపీ+ 31-40
  • జేఎంఎం+ 37-47
  • ఇతరులు 1-6
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details