తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

IRCTC Tirumala Tour : ఈ సమ్మర్​లో తిరుమల వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే, మీకోసం ఐఆర్​సీటీసీ మంచి టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలో 3 రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీలో.. శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, విశ్రాంతి సదుపాయాలు లభిస్తాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC Tirumala Tour
Tirumala

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 5:25 PM IST

IRCTC Tirumala Tour Package : సాధారణ సమయంలోనే తిరుమలలో(Tirumala) రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సమ్మర్​లో అంటారా.. పిల్లలకు సెలవులు ఉండడంతో ఆ శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడతారు. ఇలాంటి టైమ్​లో తిరుపతి వెళ్లాలంటే.. ప్రయాణ, దర్శన టికెట్లు దొరకడమూ కష్టమే. అందుకే, శ్రీవారి దర్శనం సులభతరం చేయడం కోసం.. IRCTC సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే.. విశ్రాంతి సదుపాయాలతో పాటు, ప్రత్యేక దర్శన టికెట్లూ ఈ టూర్ ప్యాకేజీలో లభిస్తాయి. ఇంతకీ ఈ టూర్ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? టికెట్ ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC).. కాకినాడ నుంచి తిరుపతికి 'విజయ్ గోవిందం(Vijay Govindam)' పేరుతో ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ రెండు రాత్రులు, మూడు పగళ్లు సాగుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలతో పాటు తిరుచానూరు ఆలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు. ప్రతీ శుక్రవారం ఈ టూర్​ ప్యాకేజీకి సంబంధించిన రైలు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీని తీసుకున్న వారు.. సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు.

టూర్ కొనసాగనుందిలా..

  • ఈ టూర్​లో భాగంగా మొదటిరోజు కాకినాడ టౌన్‌ నుంచి బయల్దేరే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్‌ నం- 17210) రాత్రి 10:50 గంటలకు విజయవాడ రీచ్ అవుతుంది.
  • రెండో రోజు మార్నింగ్ 5:10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయ్యి బ్రేక్​ఫాస్ట్ చేసి తిరుమలకు బయల్దేరుతారు. స్పెషల్ దర్శనం టికెట్లతో స్వామి వారిని దర్శించుకుంటారు.
  • అనంతరం తిరుచానూరుకు పయనమవుతారు. అక్కడ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు.
  • అదే రోజు రాత్రి 10:30 గంటలకు రైలు (తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం.17487)లో తిరుగు పయనమవుతారు. మూడో రోజు ఆయా స్టేషన్లు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

ప్యాకేజీ ధరల వివరాలు (ఒకరికి) :

  • కంఫర్ట్‌లో(థర్డ్‌ ఏసీ బెర్త్‌) సింగిల్ షేరింగ్‌కు రూ.5,850, ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.4,720 చెల్లించాల్సి ఉంటుంది. అదే.. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్‌, విత్ అవుట్ బెడ్‌కు రూ.3,810 కట్టాలి.
  • అదే.. స్టాండర్డ్‌లో(స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్​కు అయితే రూ.4,690, ట్విన్, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.3,560 చెల్లించాలి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్‌, విత్ అవుట్ బెడ్‌కు రూ.2,650 కట్టాలి.
  • ఇక టూర్ ప్యాకేజీ బుక్ చేయడానికి పర్యాటకులు https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. అందులో Vijay Govindam లింక్ పైన క్లిక్ చేసి ముందుగా వివరాలన్నీ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత మీరు ప్యాకేజీని బుక్ చేసుకోండి.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు :

  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే అవి భక్తులే చెల్లించుకోవాల్సి ఉంటుంది.
  • ఒక రోజు బ్రేక్​ఫాస్ట్ మాత్రమే ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది.
  • టూర్‌ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది.
  • ఇకపోతే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అరుణాచల దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? - స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం!

ABOUT THE AUTHOR

...view details