IRCTC Ooty Tour Package: పచ్చని ప్రకృతిలో.. అందమైన సరస్సుల పక్కనుంచి.. ఎత్తైన కొండల మధ్య ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! అలాంటి ప్రకృతి అందాలకు నెలవైన ఊటీలో విహరించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
"అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్(ULTIMATE OOTY EX HYDERABAD)" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. జూన్ 25 నుంచి సెప్టెంబర్ 24 ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఊటీ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది.
ప్రయాణం ఇలా...
- మొదటిరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17230) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీలో హోటల్‌లోనే బస ఉంటుంది.
అటు భగవత్ దర్శనాలు - ఇటు బీచ్‌లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Hyderabad Karnataka Tour
- మూడో రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాక దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ ఊటీలోనే స్టే చేయాలి.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కూనూర్ పర్యటనకు తీసుకెళ్తారు. తిరిగి ఊటీకి చేరుతారు. రాత్రి మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది.
- ఐదో రోజు అదే హోటల్‌లో టిఫెన్ చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్ పయనమవుతారు. సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం:17229) ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ధర వివరాలు:
- కంఫర్ట్‌లో (థర్డ్ ఏసీ బెర్త్) ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కు రూ.28,940, ట్విన్ షేరింగ్‌కు రూ.16,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,100, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,850 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) సింగిల్ షేరింగ్‌కు రూ.26,480, ట్విన్ షేరింగ్‌కు రూ.13,980, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,930. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,640, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,400 చెల్లించాలి. గ్రూప్ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.
- ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా! - IRCTC Sundar Saurashtra Package
"ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." - కశ్మీర్ అందాల వీక్షణకు IRCTC స్పెషల్ ప్యాకేజీ! - IRCTC Mystical Kashmir Tour