IRCTC Tourism Hyderabad - Nepal Tour: మంచుకొండలను చూస్తే.. ఎవ్వరైనా పరవశించిపోవాల్సిందే. ఈ పరవశం మీక్కూడా కలిగించేందుకు IRCTC ఓ సూపర్ ప్యాకేజీ ప్రకటించింది. నేపాల్‌లోని అందాలను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ఆపరేట్ చేస్తోంది. మరి ఈ టూర్ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
"రాయల్ నేపాల్ ఎక్స్ హైదరాబాద్(Royal Nepal Ex Hyderabad)" పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో నేపాల్‌లోని కాఠ్మండూ, పోఖారా ప్రాంతాలు కవర్ అవుతాయి. నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ లేదా వోటర్ ఐడీ ఉండాలి.
ప్రయాణ వివరాలివే:
- IRCTC "రాయల్ నేపాల్" టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి నేపాల్ రాజధాని కాఠ్మండూ చేరుకుంటారు. సాయంత్రం ఖాళీ సమయంలో స్థానిక ప్రాంతాలు చూడొచ్చు. రాత్రికి కాఠ్మండూలో బస ఉంటుంది.
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పశుపతినాథ్ ఆలయం, బుద్ధనాథ స్థూప, పఠాన్, దర్బార్ స్క్వేర్, స్వయంభునాథ్ స్థూపం సందర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత కాఠ్మండూలో బస చేయాలి.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పోఖారాకు బయల్దేరాలి. దారిలో మనకమన ఆలయం సందర్శించాలి. సాయంత్రం స్థానిక ప్రాంతాల్లో షాపింగ్ చేయొచ్చు. రాత్రికి పోఖారాలో స్టే చేయాలి.
IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం! - Madhya Pradesh Jyotirlinga Darshan
- నాలుగో రోజు తెల్లవారుజామున సూరంగ్‌కోట్‌కు బయల్దేరాలి. అక్కడ సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. బింధ్యబాసిని మందిర్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ సందర్శించవచ్చు. రాత్రికి పోఖారలో బస చేయాలి.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కాఠ్మండూకు బయల్దేరాలి. హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. అక్కడ లోకల్ ప్లేస్‌లను విజిట్ చేయవచ్చు. రాత్రికి కాఠ్మండూలో బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి కాఠ్మండూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ ఉదయం 10:50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలివే:
- ఐఆర్సీటీసీ ‘రాయల్ నేపాల్’ టూర్ ప్యాకేజీలో టికెట్ ధరలు చూస్తే.. కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.55,630, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.46,550, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.45,250. ఇక పిల్లలకు చూస్తే.. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.40,110, 2 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ అవుట్ బెడ్ అయితే రూ.35,190గా నిర్ణయించారు.
- ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి.
- ఈ ప్యాకేజీ బుక్ చేసే పర్యాటకులు నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఊటీ అందాల్లో విహరించండి - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ! - IRCTC Ultimate Ooty Ex Hyderabad
"లేహ్" అందాల వీక్షణ కోసం IRCTC సూపర్ ప్యాకేజీ - ధర అందుబాటులోనే - వివరాలివే! - IRCTC Leh With Turtuk Package