Voters In India :భారత్లో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువైంది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. దేశంలో మొత్తం 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ఈ ప్రకటనలో పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంతో పోలిస్తే, 2 కోట్లకు పైగా కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకున్నరని తెలిపింది.
గతేడాది పార్లమెంట్ ఎన్నికలప్పుడు 96.88 కోట్ల మంది ఓటర్లుండగా, ఈసీ తాజా లెక్కల ప్రకారం నేడు ఈ సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఇందులో 18-29 సంవత్సరాల వయసున్న యువతీయువకులు 21.7 కోట్ల మంది ఉన్నారు. అతి త్వరలోనే భారత్తో ఓటర్ల సంఖ్య 1 బిలియన్ (100 కోట్లు)కు చేరుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.