How To Vote Without Voter ID Card :దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం మొదలు కానుంది. మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. అయితే, పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్తూ ఓటర్ ఐడీ కార్డు కనిపించడంలేదు! ఇప్పుడు ఎలా ఓటు వేయాలని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే అలాంటి టెన్షన్ అవసరం లేదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటరు ఐడీ లేకున్నా మీరు హ్యాపీగా ఓటు వేయోచ్చని చెబుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఓటర్లకు గుర్తు చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్నికల సంఘం పోస్టు పెట్టింది.
ఓటు వేసేందుకు ఓటరు ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలా? లేనివారు ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఓటరు జాబితాలో పేరున్న వారంతా ఓటరు ఐడీ అందుబాటులో లేకున్నా, ఓటు వేయవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఈ కింద తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. అవేంటంటే?
ఓటరు ఐడీ లేనివారు ఈ కార్డులను చూపించవచ్చు:
1. ఆధార్ కార్డు
2. డ్రైవింగ్ లైసెన్స్
3. పాన్ కార్డు
4. ఉపాధి హామీ కార్డు
5. పాస్ పోర్టు