How To Make Vankaya Bajji In Telugu :సాయంత్రం అయిందంటే చాలు చాలామంది టీతోపాటు బజ్జీలు లేదా పకోడీలు లాగిస్తుంటారు. సాయంత్రం పూట బజ్జీలను స్నాక్స్‌గా తీసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. చాలామంది సాధారణంగా బండ్లపై లభించే మిర్చి, ఆలూ, ఎగ్ బజ్జీలనే తింటుంటారు. అయితే.. కూరలలో రారాజైన వంకాయతో బజ్జీలు చేస్తే మాత్రం అదుర్స్ అంటారు.
చాలా మందికి వంకాయ పేరు వినగానే నోరూరుతుంది. పైగా దీంట్లో ఉండే పోషకాలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఎన్నో సుగుణాలను ఉన్న వంకాయను కొందరు కర్రీ వండితే తినరు. కాబట్టి అందులోని ఔషధ గుణాలు పోకుండా.. అందరూ తినేలా బజ్జీ చేసుకుంటే ఏ ప్రాబ్లమూ ఉండదు. అంతేకాదు.. ఎప్పుడూ రొటీన్‌గా తినే ఎగ్ బజ్జీ, మిర్చీ బజ్జీలు కాకుండా.. సరికొత్తగా ట్రై చేసినట్టుగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వర్షాకాలంలో వేడివేడి వంకాయ బజ్జీలను ఆస్వాదించండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- వంకాయలు
- శనగపిండి
- ఉల్లిపాయలు
- అల్లం
- వెల్లుల్లి
- కొత్తిమీర
- జీడిపప్పు
- కారం
- పసుపు
- పచ్చిమిర్చి
- ఉప్పు
- నూనె
తయారీ విధానం..
- ముందుగా వంకాయలను నిలువుగా చీరి ఉప్పు నీటిలో వేసి కడుక్కోవాలి. (బజ్జీ కాబట్టి చిన్న వంకాయలను తీసుకోవడం బెటర్)
- వంకాయలకు మసాలా మంచిగా పట్టేందుకు వీలుగా లోపల విత్తనాలను తీసేయాలి.
- మరోవైపు స్టౌపై కడాయి పెట్టి వేడి చేసుకుని నూనె పోయాలి.
- నూనె వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకుని వేగాక దించుకొని పక్కకు పెట్టుకోవాలి.
- వేడి చల్లారక వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. (అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే మసాలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది)
- గ్రైండ్ చేసుకున్న మసాలాను వంకాయ మధ్యలో పెట్టుకోవాలి.
- అనంతరం ఓ గిన్నెలో బజ్జీ కోసం శనగపిండి తీసుకుని ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి.
- ఆ తర్వాత కడాయి తీసుకుని స్టౌపై పెట్టి వేడయ్యాక నూనెను పోసుకోవాలి.
- వేడయ్యాక మసాలా పెట్టుకున్న వంకాయను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
- వంకాయ బజ్జీ పూర్తిగా కాలే వరకు ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ పక్కా! మీరు ఓసారి ట్రై చేయండి.
సూపర్ ఐడియా: టొమాటో కెచప్‌తో సరికొత్త ఉపయోగం - మీ ఇంట్లోని వస్తువులు తళతళా మెరిసిపోతాయ్! - Cleaning Tips With Tomato Ketchup
మిగిలిపోయిన అన్నంతో "ఎగ్ ఫ్రైడ్ రైస్" - తిన్నారంటే వారెవ్వా ఏం టేస్ట్ రా బాబు అంటారు! - Egg Fried Rice Recipe