తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ దోసెలు తింటే రుచికి రుచి.. బరువూ తగ్గుతారు - వెయిట్​లాస్​ కావాలనుకునేవారికి అద్భుత అవకాశం! - Oats Dosa Recipe - OATS DOSA RECIPE

How To Make Oats Dosa : ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్​.. కాస్త బొంబాయి రవ్వ.. కేవలం 10 నిమిషాలు.. కట్​ చేస్తే వేడి వేడి ఓట్స్ దోశ రెడీ! ఏంటీ జస్ట్ టెన్​ మినట్స్​లో దోశ రెడీ అవుతుందా అని ఆలోచిస్తున్నారా! అయితే ఈ స్టోరీ చదివి వెంటనే ఇన్​స్టాంట్​ ఓట్స్ దోశ చేసేయండి.

Oats Dosa
How To Make Oats Dosa (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 11:06 AM IST

How To Make Restaurant Style Oats Dosa : చాలా మందికి దోశ అంటే విపరీతమైన ఇష్టం. కానీ తయారీ ప్రక్రియ గుర్తుకు వస్తేనే ఇప్పుడు అయ్యే పని కాదులే అనుకుంటారు. ఇకపై అలా ఆలోచించాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఎలాంటి ప్రీ ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడే కేవలం 10 నిమిషాల్లోనే దోశ రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఓట్స్​తో. ఇవి టేస్టీగా, ఫ్లఫ్పీగా చాలా బాగుంటాయి. ఇందులో నూనె సైతం చాలా తక్కువగానే పడుతుంది. మరి ఇంత టేస్టీ ఇన్​స్టాంట్​ దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా?
కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు ఓట్స్​ పిండి
  • మూడు పావుల బియ్యపు పిండి
  • పావు కప్పు బొంబాయి రవ్వ
  • ఉల్లిపాయ ముక్కలు
  • టీ స్పూన్​ జీలకర్ర
  • టీ స్పూన్​ అల్లం తరుగు
  • పచ్చిమిర్చి తరుగు
  • ముప్పావు టీ స్పూన్​ మిరియాల పొడి
  • పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • ఉప్పు
  • కొత్తిమీర తరుగు
  • క్యారెట్​ (అవసరాన్ని బట్టి)
  • ఒక కప్పు పెరుగు(పుల్లది అయితే బాగుంటుంది)
  • నూనె

తయారీ విధానం :

  • ముందుగా ఒక కప్పు ఓట్స్​ను తీసుకుని మిక్సీలో వేసి పిండి చేసుకోండి. (ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది సుమా)
  • ఇందులోనే మూడు పావుల బియ్యపు పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, టీ స్పూన్​ జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చీ ముక్కులు, ముప్పావు టీ స్పూన్​ మిరియాల పొడి, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, అవసరాన్ని బట్టి క్యారెట్​ తురుము వేసుకోండి.
  • ఆ తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి.
  • అనంతరం ఈ మిశ్రమాన్ని తీసుకుని వేడి చేసుకున్న పెనంపైనా వేసుకోండి.
  • ఉల్లిపాయ, పచ్చిమిర్చీ ఉండడం వల్ల మందంగానే వస్తుంది. ఈ మిశ్రమంతో కేవలం దోశ మాత్రమే కాకుండా ఊతప్పం, గుంట పనుగులు కూడా చేసుకోవచ్చు.
  • దోశ కాస్త కాలాక ఓ టీ స్పూన్​ నూనె అంచుల వెంట వేసి ఎర్రగా కాల్చండి.
  • ఇది మాములు అట్టులా త్వరగా కాలదు. కాస్త సమయం పడుతుంది.
  • త్వరగా తీస్తే పిండిగా ఉండి తినేటప్పుడు నోట్లో అంటుకుపోతుంది. కాబట్టి మీడియం మంటలో నిధానంగా కాల్చాలి.
  • ఒకవైపు కాలాక మెల్లగా తిప్పుకుని మరోవైపు కాల్చుకోవాలి. కాస్ట్ ఐరన్​ పెనంపైనా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
  • ఇది మామూలు కొబ్బరి చట్నీతోనే కాకుండా అల్లం, టమాట చట్నీతో కూడా బాగుంటుంది. చాలా సింపుల్​గా ఉంది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి

ఇవి కూడా చదవండి :

ABOUT THE AUTHOR

...view details