తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సండే ధమాకా - కీమా బిర్యానీ ఇలా ట్రై చేయండి! అద్దిరిపోద్ది! - Mutton Keema Biryani Preparation

Mutton Keema Biryani: మీకు బిర్యానీ అంటే ఇష్టమా? అయితే.. ఎప్పుడూ తినే చికెన్​ బిర్యానీ కాకుండా.. ఈసారి కీమా బిర్యానీ టేస్ట్​ చేయండి. అద్దిరిపోతుందంటే నమ్మండి! ఇక లేట్​ లేకుండా మీరు ట్రై చేయండి..

Mutton Keema Biryani
Mutton Keema Biryani

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:35 AM IST

Updated : Mar 10, 2024, 2:28 PM IST

Mutton Keema Biryani: బిర్యానీ అనగానే చికెన్​ దమ్​ బిర్యానీ, చికెన్​ ఫ్రై పీస్​ బిర్యానీ, మటన్​ బిర్యానీ, ప్రాన్స్​ బిర్యానీ గుర్తొస్తాయి. అయితే.. రోజూ వాటినే తింటే స్పెషల్ ఏముంది? అందుకే.. ఈసారి నోరూరించే కీమా బిర్యానీ లాగించండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా ఈజీనే. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

  • మటన్​ కీమా - 1 కేజీ
  • బాస్మతి రైస్- అరకిలో
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు
  • సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
  • పచ్చిమిరపకాయలు- 3
  • లవంగాలు-4
  • దాల్చిన చెక్క-2
  • యాలకులు-2
  • మిరియాలు - 10
  • జాపత్రి - కొద్దిగా
  • జాజికాయ - 1
  • మరాఠి మొగ్గ -1
  • బిర్యానీ ఆకులు - 2
  • షాజీరా - చిటికెడు
  • అనాస పువ్వు - 2
  • అల్లంవెల్లుల్లి ముద్ద - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • ధనియాల పొడి,
  • ఉప్పు- తగినంత,
  • కారం - తగినంత
  • పెరుగు- 200 గ్రాములు
  • నూనె- పావుకప్పు
  • కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున,
  • నెయ్యి - 2 టీస్పూన్లు
  • నీరు - తగినంత
  • ఫుడ్ కలర్ (కావాలనుకుంటే)

తయారీ విధానం:

  • ముందుగా బాస్మతీ బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద మందపాటి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఇంకో స్టవ్​ మీద గిన్నె పెట్టి రెండు లీటర్ల నీరు పోసి వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, రుచికి సరిపడా కారం వేసి వేయించాలి. ఓ రెండు నిమిషాల తర్వాత కీమా, పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి.
  • కీమాలో నీరు ఇంకి పోయి ముప్పావు వంతు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో స్టవ్​ మీద పెట్టిన నీళ్లు మరుగుతున్న సమయంలో బిర్యానీ ఆకు, అనాసపువ్వు, జాపత్రి, జాజికాయ పొడి, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
  • ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి 60 శాతం కుక్​ అయిన తర్వాత స్టవ్​ సిమ్​లో పెట్టాలి.
  • ఇప్పుడు మరో పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ముప్పావంతు ఉడికిన అన్నాన్ని చిల్లుల గంటె సాయంతో తీసి పొరలా వేసుకోవాలి.
  • ఆ పైన రెడీ చేసుకున్న కీమా మిశ్రమం, వేయించిన ఉల్లిపాయముక్కలు కొద్దిగా, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి.
  • మళ్లీ ఇంకోసారి అదే విధంగా అన్నం, కీమా, ఉల్లిపాయ ముక్కల కలిపి అలా మూడు పొరలుగా వేసుకోని చివరగా మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి.
  • ఇక అన్నంపైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కొద్దిగా ఫుడ కలర్​ కలిపిన నీళ్లు వేసి మూత పెట్టి 20 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • అంతే ఎంతో టేస్టీ అండ్​ స్పైసీ కీమా బిర్యానీ రెడీ. దీనిని కుకుంబర్​ రైతాతో తింటే కాంబినేషన్​ అద్దిరిపోద్ది.
Last Updated : Mar 10, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details