కుళాయి రిపేర్..
మనందరి ఇళ్లలో కుళాయిలు ఉంటాయి. ఇవి కొంత కాలానికి పాడైపోతుంటాయి. వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అందువల్ల కుళాయి రిపేర్ నేర్చుకోవాలి. దీనికి కంటింగ్ ప్లేయర్ అవసరం పడొచ్చు.. ఒకటి కొని ఉంచండి. అది చాలా పనులకు అవసరమవుతుంది.
డోర్‌నాబ్‌ను టైట్ చేయడం..
ఒక్కోసారి గది తలుపులకు ఉండే డోర్‌నాబ్ లూజ్ అవుతుంటుంది. ఇంత చిన్న విషయానికి ఎవరినీ పిలవలేము. ఇంట్లో స్కూడ్రైవర్ ఉంటే మనమే టైట్‌గా ఫిట్ చేసుకోవచ్చు. కాబట్టి.. ఒక స్క్రూడ్రైవర్ కొనుగోలు చేయండి.
సింక్ క్లీన్ చేయడం..
కొన్నిసార్లు ఆహార పదార్థాలు సింక్ పైపులో ఇరుక్కుపోవడం వల్ల నీళ్లు వెళ్లకుండా ఉంటాయి. అలాంటప్పుడు సింక్ శుభ్రం చేయడం రావాలి.
సీలింగ్ ఫ్యాన్ బిగించడం..
ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్‌లు ఎప్పుడో ఒకప్పుడు రిపేర్‌కు వస్తూనే ఉంటాయి. లేదంటే.. కొత్త ఇంట్లోకి కిరాయికి వెళ్లినప్పుడో, కొత్త ఫ్యాన్ కొనుగోలు చేసినప్పుడో.. ఫ్యాన్ బిగించాల్సి ఉంటుంది. కండెన్సర్ పవర్ పోవడం వల్ల కూడా ఫ్యాన్ సరిగా తిరగదు.. దానికి మెకానిక్ అవసరం లేదు. షాపులోంచి తెచ్చి మనమే సెట్ చేయొచ్చు. ఈ పని అందరికీ తెలిసి ఉండాలి.
పగిలిన టైల్స్‌ను రిపేర్ చేయడం..
కొన్ని సార్లు ఏదైన బలమైన వస్తువు టైల్స్‌పై పడటం వల్ల అవి దెబ్బతింటాయి. అవి మరింత డ్యామేజ్ కాకుండా ఫిక్స్ చేయగలగాలి.
సీలింగ్ మరకలు తొలగించడం..
ఇళ్లకు కొత్తగా పెయింట్ వేసే ముందు సీలింగ్‌కు ఉన్న మరకలను తొలగించడం చాలా ముఖ్యం. కొంత బ్లీచింగ్ పౌడర్‌ను ఉపయోగించి వాటిని తొలగించ వచ్చు.
స్వెట్టర్ కుట్టడం..
చలికాలంలో మనల్ని చలి నుంచి రక్షించే స్వెట్టర్లు.. వివిధ కారణాల వల్ల కుట్లు ఊడిపోతుంటాయి. సూది సహాయంతో స్వెట్టర్ కుట్టుకోవచ్చు. దానికోసం టైలర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగని వదిలేస్తే మరింతగా చిరిగిపోతుంది.