Himachal Teacher Job Notification :హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ గవర్నమెంట్ హైస్కూల్ ఇచ్చిన టీచర్ జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో టీచర్ కంటే వాచ్మెన్ ఉద్యోగానికే ఎక్కువ జీతం ఉంది. దీంతో అంతా ఓ నోటిఫికేషన్ కోసమే మాట్లాడుకుంటున్నారు! అసలు విషయమేమింటంటే?
పార్ట్ టైమ్ టీచర్, వాచ్మెన్ ఉద్యోగాల కోసం చంబా జిల్లాలోని భర్మోర్ హైస్కూల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ ప్రకటనలో పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుడికి విద్యార్హత బీఎస్సీ/ఎమ్స్సీ బీఈడీ, టెట్, అదే వాచ్‌మెన్‌కు పదోతరగతిగా పేర్కొంది. అయితే వాచ్మెన్ కంటే టీచర్‌కు ఇచ్చే జీతమే తక్కువగా ఉంది. పార్ట్‌టైమ్ టీచరుకు రూ.8,450 కాగా, వాచ్మెన్ రూ.10,630గా ఉంది. రెండు పోస్టులకు అక్టోబరు 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది.