తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హరియాణా ఎన్నికలు ఓ గుణపాఠం- ఓవర్​ కాన్ఫిడెన్స్​ పనికిరాదని అర్థమైంది' : అరవింద్ కేజ్రీవాల్ - HARYANA ASSEMBLY ELECTION RESULTS

Haryana Election Results 2024 Live Updates
Haryana Election Results 2024 Live Updates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 6:48 AM IST

Updated : Oct 8, 2024, 2:30 PM IST

Haryana Election Results 2024 Live Updates : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 67.9 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోటి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్‌ ఫిగర్ 46 సీట్లు రావాలి. కాగా, హ్యాట్రిక్‌ విజయం తమదేనని బీజేపీ నేతల ధీమా వ్యక్తం చేసింది. గెలుపు ఖాయమని కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే హరియాణాలో కాంగ్రెస్‌దే గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

LIVE FEED

2:29 PM, 8 Oct 2024 (IST)

కాంగ్రెస్​ ఆరోపణను ఖండించిన ఈసీ

ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో ఫలితాలు అప్​లోడ్ చేయడంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. బాధ్యతారాహిత్యంగా చేసిన ఆరోపణను ఖండించింది. వారి అసంబద్ధ ఆరోపణను రుజుచేయడానికి ఏ ఆధారాలు లేవని గట్టిగా చెప్పింది.

2:04 PM, 8 Oct 2024 (IST)

ఓవర్​ కాన్ఫిడెన్స్​ పనికిరాదు : అరవింద్ కేజ్రీవాల్

ఎన్నికల్లో ఎప్పడూ ఓవర్​ కాన్ఫిడెన్స్​ ప్రదర్శనించకూడదని, హరియాణా ఎలక్షన్స్​ ద్వారా గుణపాఠం నేర్చుకున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ తెలిపారు. ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోకూడదన్న కేజ్రీవాల్​, ప్రతి సీటు చాలా కఠినమైనదని చెప్పారు. ఆప్​ మున్సిపల్​ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్​తో పొత్తు విఫలమవడం వల్ల, 89స్థానాల్లో ఆప్​ ఒంటరిగా పోటీచేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది.

2:01 PM, 8 Oct 2024 (IST)

కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌ విజయం

  • కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌ విజయం
  • 6,015 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మాజీ రెజ్లర్‌

1:43 PM, 8 Oct 2024 (IST)

బీజేపీ 9, కాంగ్రెస్+ 2 స్థానాల్లో విజయం

  • బీజేపీ 9 స్థానాల్లో గెలుపు, 37 చోట్ల ముందంజ
  • కాంగ్రెస్+ 2 స్థానాల్లో విజయం, 30 స్థానాల్లో అధిక్యం
  • INLD+ 2, ఇతరులు 4 స్థానాల్లో అధిక్యం
  • ఖాతా తెరవని ఆమ్​ ఆద్మీ పార్టీ
  • అంబాలా పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు

12:29 PM, 8 Oct 2024 (IST)

నెమ్మదిగా ఎన్నికల ట్రెండ్స్ అప్​లోడ్​!- ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఎన్నికల ట్రెండ్స్​ అప్‌డేట్ చేయడంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ ECIకి ఫిర్యాదు చేసింది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్​ను షేర్​ చేస్తూ అధికారులపై ఒత్తిడి పెండడానికి బీజేపీ ఒత్తిడి చేస్తోందా అని కాంగ్రెస్ ప్రశ్నించింది

12:20 PM, 8 Oct 2024 (IST)

2 స్థానాల్లో కాంగ్రెస్+ విజయం - బీజేపీ 46 స్థానాల్లో ముందంజ

  • బీజేపీ 46 స్థానాల్లో ముందంజ
  • 2 స్థానాల్లో కాంగ్రెస్+ విజయం
  • 36 స్థానాల్లో కాంగ్రెస్+ లీడ్
  • INLD+ 2, ఇతరులు 4 స్థానాల్లో అధిక్యం
  • ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది : బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్
  • బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు : బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్
  • కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు : బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్

11:45 AM, 8 Oct 2024 (IST)

హరియాణాలో హ్యాట్రిక్‌ దిశగా బీజేపీ

  • హరియాణాలో హ్యాట్రిక్‌ దిశగా బీజేపీ
  • హరియాణాలో మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో బీజేపీ
  • హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ
  • హరియాణాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తలకిందులు

11:34 AM, 8 Oct 2024 (IST)

హరియాణాలో బీజేపీ అధిక్యం- ఆనందంలో అనిల్​ విజ్ పాట

  • హరియాణాలో అధిక్యంలో బీజేపీ
  • 44 స్థానంలో బీజేపీ ముందంజ
  • 39 స్థానంలో కాంగ్రెస్+ అధిక్యం, ఐఎన్​ఎల్​డీ 2, ఇతరులు 5 స్థానాల్లో లీడ్
  • పాట పాడుతూ బీజేపీ నేత అనిల్​ విజ్​ ఫుల్​ ఖుషీ

11:03 AM, 8 Oct 2024 (IST)

షణక్షణానికి మారుతున్న ఆధిక్యాలు

  • హరియాణాలో ఉత్కంఠభరితంగా ఎన్నికల ఫలితాలు
  • హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ
  • హరియాణా: క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యాలు
  • హరియాణా: ప్రారంభంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌
  • ప్రస్తుతం 42 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ ముందంజ
  • హరియాణా: 41 స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజ
  • హరియాణా: 2 స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీ, 5 స్థానాల్లో ఇతరులు ముందంజ
  • కౌంటింగ్​ కేంద్రం వద్ద జులానా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్​ ఫొగాట్​
  • ప్రస్తుతం జులానాలో వినేశ్​ వెనుంజ

10:29 AM, 8 Oct 2024 (IST)

బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

  • బీజేపీ 41 స్థానాల్లో ముందంజ
  • కాంగ్రెస్+ 39 స్థానాల్లో లీడ్, INLD+ 4, ఇతరులు 6 స్థానాల్లో అధిక్యం
  • మేము 60 స్థానాలకుపైగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : కాంగ్రెస్ నేత కుమారి సెల్జా
  • జులానాలో వినేశ్​ ఫొగాట్​ వెనుకంజ
  • అంబాలా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అనిల్​ విజ్​ వెనుకంజ

10:05 AM, 8 Oct 2024 (IST)

హరియాణాలో అధిక్యంలోకి వచ్చిన బీజేపీ

హరియాణాలో బీజేపీ అధిక్యంలోకి వచ్చింది. 44 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 37 చోట్ల, ఇతరులు 9 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.

9:49 AM, 8 Oct 2024 (IST)

టెన్షన్ టెన్షన్- బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

  • కాంగ్రెస్+ 42 స్థానాల్లో ముందంజ
  • బీజేపీ 41 స్థానాల్లో లీడ్, ఇతరులు 7 స్థానాల్లో అధిక్యం
  • గర్హి సంప్లా-కిలోయ్‌ స్థానంలో మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేంద్ర హుడ్డా ముందంజ
  • కాంగ్రెస్ హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది : భూపేంద్ర హుడ్డా
  • ఇంకా ఖాతా తెరవని ఆమ్​ ఆద్మీ పార్టీ

9:35 AM, 8 Oct 2024 (IST)

అధిక్యంలో కాంగ్రెస్

  • కాంగ్రెస్+ 40 స్థానాల్లో ముందంజ
  • బీజేపీ 34 స్థానాల్లోలీడ్, ఇతరులు 6
  • లాడ్వా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నాయబ్​ సింగ్ సైనీ ముందంజ

9:22 AM, 8 Oct 2024 (IST)

బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ- చండీగఢ్​కు ఏఐసీసీ పరిశీలకులు

  • 33 స్థానాల్లో కాంగ్రెస్+ ముందంజ
  • 32 స్థానాల్లో బీజేపీ లీడ్, ఇతరులు 6
  • జులానా నుంచి రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ (కాంగ్రెస్‌) ముందంజ
  • చండీగఢ్​కు బయలుదేరిన హరియాణా ఏఐసీసీ పరిశీలకులు అజయ్​ మాకెన్, అశోక్​ గెహ్లోత్​, ప్రతాప్​ సింగ్ భజ్వా

8:41 AM, 8 Oct 2024 (IST)

హరియాణాలో 17చోట్ల కాంగ్రెస్‌, 14చోట్ల బీజేపీ బీజేపీ లీడ్

  • కొనసాగుతున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్
  • హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్ 46
  • హరియాణాలో 17చోట్ల కాంగ్రెస్‌, 14చోట్ల బీజేపీ ముందంజ

8:03 AM, 8 Oct 2024 (IST)

లెక్కింపు ప్రారంభం

మొదట పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు లెక్కించనున్నట్లు హరియాణా చీఫ్​ ఎలక్టోరల్ అధికారి పంకజ్ అగర్వాల్​ తెలిపారు. అనంతరం ఈవీఎమ్​లలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్​ చేయనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

6:59 AM, 8 Oct 2024 (IST)

కౌంటింగ్​ కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి నాయబ్​ సింగ్ సైనీ

హరియాణా ముఖ్యమంత్రి, లాడ్వా నియోజకం వర్గం బీజేపీ అభ్యర్థి నాయబ్​ సింగ్ సైనీ కురుక్షేత్రంలోని సైనీ సమాజ్​ ధర్మశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైనీ, తమకు ఎలాంటి కూటమి అవసరం లేదన్నారు. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Last Updated : Oct 8, 2024, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details