తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గంగా నది నీరు తాగడానికి పనికిరావు- కేవలం స్నానానికే' - HARIDWAR GANGA WATER POLLUTION

హరిద్వార్​లో గంగా జలం తాగడానికి పనికిరావన్న ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి- స్నానానికి వినియోగించుకోవచ్చని సూచన

Ganga water in Haridwar
Ganga water in Haridwar (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2024, 11:48 AM IST

Haridwar Ganga Water :హరిద్వార్​లోని గంగా నది నీరు తాగడానికి పనికిరాదని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి తేల్చిచెప్పింది. అయితే స్నానానికి వినియోగించుకోవచ్చని సూచించింది. గంగా నదిలో నీటి నాణ్యత కేటగిరీ 'బి' స్థాయికి పడిపోయిందని తెలిపింది.

'తాగడానికి పనికిరావు- స్నానానికే ఓకే'
"కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి నాణ్యతను 5 తరగతులుగా విభజించింది. అందుకు పీహెచ్, కరిగిన ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్, కోలిఫాం బ్యాక్టీరియా వంటి నాలుగు పరిమితుల ఆధారంగా నీటి నాణ్యతను అంచనా వేస్తోంది. హరిద్వార్​లో గంగా నదిలోని నీటి నాణ్యత 'బి' కేటగిరీలో ఉంది. అంటే ఆ గంగా జలం తాగడానికి పనికిరావు. స్నానానికి అనువుగా ఉంటాయి" అని ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(యూకేపీసీబీ) ప్రాంతీయ అధికారి రాజేంద్ర సింగ్ తెలిపారు.

'మానవ వ్యర్థాల వల్లే కాలుష్యం'
హరిద్వార్​లో గంగా నది నీటి కాలుష్యంపై స్థానిక పూజారి ఉజ్వల్ పండింట్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల వల్ల గంగాజల స్వచ్ఛత దెబ్బతింటుందని ఆరోపించారు. "గంగాజలంతో స్నానం చేయడం క్యాన్సర్ సహా శరీరంలోని ఇతర రోగాలు నయమవుతాయి. గంగాజలాన్ని తీసుకుని 10 ఏళ్ల తర్వాత తనిఖీ చేసినా దాని స్వచ్ఛత తగ్గదు. గంగాజలం స్వచ్ఛత మానవ వ్యర్థాల వల్లే దెబ్బతింటోంది. దానిని అరికట్టాల్సిన అవసరం ఉంది" అని పూజారి ఉజ్వల్ పండింట్ వ్యాఖ్యానించారు.

నెలకు 8చోట్ల పరీక్షలు
కాగా, ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రతి నెలా హరిద్వార్ చుట్టూ ఉన్న ఎనిమిది ప్రదేశాలలో గంగా జలాన్ని పరీక్షిస్తుంది. నవంబర్ నెలకు సంబంధించి జరిపిన పరీక్షల్లో హరిద్వార్​లోని గంగా నది నీరు 'బి' కేటగిరీగా తేలింది. అయితే నది నీటి నాణ్యతను ఐదు కేటగిరీలుగా విభజించారు. 'ఎ' కేటగిరి నీరు అతి తక్కువ విషపూరితమైనది. అంటే క్రిమిసంహారణ తర్వాత ఆ నీటిని తాగొచ్చు. 'ఇ' కేటగిరీ వచ్చిన నీటిని అత్యంత విషపూరితమైనదిగా తేల్చారు.

కాలుష్య కోరల్లో యమునా నది
కాగా, భారత్​లోని నదీజలాలలో కాలుష్యం గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దిల్లీలోని యుమునా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. డిసెంబర్ 1న యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details