General Elections 2024 in Summer :వేసవి వేడిని మరింత పెంచడానికి ఎన్నికలు సిద్ధమయ్యాయి. మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం వల్ల వేసవి హీట్ రెట్టింపైంది. నామినేషన్లు, క్యాంపెయిన్లు, పార్టీ మీటింగ్‌లు, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాలతో ఈ సమ్మర్‌లో ఎన్నికలు సెగ గట్టిగా తగలనుంది. గత నాలుగు పర్యాయలుగా వేసవి వేడిని పెంచిన ఎన్నికలు మరోసారి సమ్మర్ హీట్‌ను పెంచేందుకు రెడీ అయ్యాయి. ఈ ఏడాది దాదాపు నెలన్నర రోజులు పాటు సుదీర్ఘంగా ఎన్నికలు జరగనున్నాయి.
ముందస్తుకు పోవడం వల్లే ఎన్నికలు ముందుకు
2004లో దేశంలో ఎన్నికలు మొదటసారిగా వేసవి కాలంలో జరిగాయి. అంతకుముందు వరకు సెప్టెంబరు, అక్టోబర్ నెలలో లోక్‌సభ ఎన్నికల జరిగేవి. 1999 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అటల్ బీహరీ వాజేపేయి ప్రభుత్వం 2004లో ముందుస్తు ఎన్నికలకు రావడం వల్ల దేశంలో తొలిసారి వేసవి కాలంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు వాజేపేయి ప్రభుత్వం ఆరు నెలలు ముందుకు అంటే ఏప్రిల్, మే నెలలో ముందుస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జయకేతనం ఎగురవేసింది. అప్పటి నుంచి ఎన్నికల వరుసగా వేసవిలో జరగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఇలా
- 1998 లోక్‌సభ ఎన్నికలు- 13 రోజుల్లో పోలింగ్ పూర్తి
- 1999 లోక్‌సభ ఎన్నికలు- 29 రోజుల్లో పోలింగ్ పూర్తి
- 2004 లోక్‌సభ ఎన్నికలు- నాలుగు దశల్లో 21 రోజుల్లో పోలింగ్ పూర్తి
- 2009 లోక్‌సభ ఎన్నికలు- ఐదు దశల్లో 28 రోజుల్లో పోలింగ్ పూర్తి
- 2014 లోక్‌సభ ఎన్నికలు- తొమ్మిది దశల్లో 36 రోజుల్లో పోలింగ్ పూర్తి
- 2019 లోక్‌సభ ఎన్నికలు- ఏడు దశల్లో 39 రోజుల్లో పోలింగ్ పూర్తి