Gas Cylinder Saving Tips in Telugu :ఓ వైపు వంటగ్యాస్ ధరలు మండుతుంటే.. మరోవైపు కొద్ది రోజుల్లోనే సిలిండర్ ఖాళీ అయితే ఎలా ఉంటుంది? మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా? అయితే.. మీకోసం కొన్ని బెస్ట్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అవ్వడం ద్వారా గ్యాస్‌తో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
బర్నర్ శుభ్రంగా ఉంచుకోవాలి :గ్యాస్ త్వరగా అయిపోవడానికి బర్నర్ శుభ్రంగా లేకపోవడం ఒక కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి, మీ గ్యాస్ స్టౌలోని బర్నర్‌ను ఎప్పటికప్పుడు మురికి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. మురికి ఉంటే గ్యాస్ ఫ్లో సరిగా ఉండదని చెబుతున్నారు. దాంతో గ్యాస్ వృథా అవుతుందంటున్నారు. బర్నర్ శుభ్రంగా లేకపోతే గ్యాస్ లీకేజీ అయ్యే అవకాశం కూడా ఉంటుందని సూచిస్తున్నారు.
తడి పాత్రలు వద్దు : మనలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. కొన్నిసార్లు పాత్రలు క్లీన్ చేసిన వెంటనే వంట చేయడానికి యూజ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల తడిపాత్ర హీట్ అవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఇలా ఒక రోజు అయితే ఫర్వాలేదు కానీ.. రోజూ ఇదే రిపీట్ అయితే మాత్రం.. చాలా గ్యాస్ వేస్ట్ అవుతుందని సూచిస్తున్నారు. కాబట్టి వంట వండే గిన్నెలు పొడిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.
అలర్ట్ : గ్యాస్ సిలిండర్ గురించి ఈ విషయాలు తెలుసా? - ప్రమాదం ఎప్పుడైనా ముంచుకు రావొచ్చు!
మూత పెట్టండి : చాలా మంది వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టరు. దాంతో కూరగాయలు, అన్నం ఉడకాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే.. వంట పాత్రలపై మూత పెడితే త్వరగా ఉడుకుతాయంటున్నారు నిపుణులు. కావాలనుకుంటే.. మీరు ప్రెషర్ కుక్కర్‌ని యూజ్ చేయవచ్చు. ఈ విధంగా కొంతమేర గ్యాస్ సేవ్ చేసుకోవచ్చంటున్నారు.
కూల్ తగ్గాక ఉపయోగించాలి :మనలో చాలా మందికి పాల నుంచి మిగతా ఆహార పదార్థాల వరకు ఫ్రిజ్‍లో పెట్టే అలవాటు ఉంటుంది. అయితే, వాటిని పొయ్యిమీద పెట్టేడానికి ముందే బయటకు తీసి.. రూమ్ టెంపరేచర్‌కు సమానమయ్యేదాకా ఉంచాలట. అలా కాకుండా.. కూల్‍గా ఉన్నప్పుడే వాడితే.. వేడెక్కడానికి టైమ్ పడుతుందని చెబుతున్నారు. గ్యాస్ వేస్టే కావడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఈ గిన్నెలను వాడండి : మీరు ఉపయోగించే పాన్ కూడా గ్యాస్ ఆదా చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. మీరు ఫ్లాట్‌గా ఉండే పాన్ వాడుతున్నట్లయితే గ్యాస్ సమానంగా వ్యాప్తి చెందుతుంది. అంతటా వేడి వ్యాపించి.. త్వరగా వంట కంప్లీట్ అవుతుంది. అదే.. గుంతగా ఉన్న పాత్రలయితే మధ్యలో మాత్రమే త్వరగా వేడెక్కి.. పై వరకూ వేడి రావడానికి టైమ్ పడుతుందంటున్నారు.
వీటితో పాటు.. బియ్యం, పప్పులు వంటివి ముందుగా నానబెట్టి ఆపై వండుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల అవి చాలా త్వరగా ఉడుకుతాయి. ఫలితంగా కొంతమేర గ్యాస్ ఆదా చేసుకోవచ్చంటున్నారు. అలాగే.. గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఎందుకంటే.. ఏదైనా లీకేజీ ఉంటే తెలుసుకోవచ్చు. దీనివల్ల గ్యాస్ ఆదా చేసుకోవడంతోపాటు ప్రమాదాలనూ నివారించవచ్చని చెబుతున్నారు.
మరకలు పడి గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారిందా? - ఈ టిప్స్‌తో కొత్తదానిలా తళతళా మెరిసిపోద్ది!