Mumbai Boat Accident : అరేబియా సముద్ర జలాల్లో విహార యాత్ర బుధవారం తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబయి తీరానికి సమీపంలోని ప్రసిద్ధ ఎలిఫెంటా దీవిని సందర్శించేందుకు వెళ్తున్న పర్యాటకుల ఫెర్రీని నౌకాదళానికి చెందిన స్పీడ్ బోటు (నేవీ క్రాఫ్ట్) ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్‌లో ఉన్న స్పీడ్ బోటు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఢీకొనడంతో ఫెర్రీ సముద్ర జలాల్లోకి ఒరిగింది.
ప్రయాణికులు అందరూ నీటిలోకి పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల వారందరూ సముద్రంలో తేలియాడారు. ఈ లోగా నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్ విభాగాలకు చెందిన సహాయక సిబ్బంది పడవల్లో, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకుని 99 మందిని రక్షించారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందారని నేవీ వైద్యులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది కాగా మిగిలిన పది మంది ఫెర్రీ ప్రయాణికులు. ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5లక్షల చొప్పున సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
STORY | One dead, 66 rescued after ferry capsizes off Mumbai coast
— Press Trust of India (@PTI_News) December 18, 2024
READ: https://t.co/xFxMF3QB52
VIDEO | Search and rescue operation being conducted by Indian Navy in coordination with the Coast Guard and Marine Police.
(Source: Third Party)
(Full video available on PTI Videos… pic.twitter.com/9dUwt40tqr
Mumbai Boat accident | Mumbai: There were a total of 85 passengers on board including the crew. 80 people have been rescued so far and 5 people are missing. The 5 admitted to the hospital are in critical condition and 1 is dead. The rest of the people are stable: BMC
— ANI (@ANI) December 18, 2024
(Image… pic.twitter.com/rXSUD3OtBE
ప్రమాద దృశ్యాలను వీడియోలో చిత్రీకరించిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రయాణికులతో కూడిన ఫెర్రీ ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరి ఎలిఫెంటా దీవికి వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సహాయక చర్యల్లో నేవీకి చెందిన 11 పడవలు, మెరైన్ పోలీసులకు చెందిన మూడు బోట్లు, కోస్టుగార్డు పడవ ఒకటి పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు హెలికాప్టర్లను ఇందుకోసం వినియోగించారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు సిబ్బంది, మత్స్యకారులు కూడా ప్రయాణికులను రక్షించేందుకు యత్నించారు. రాత్రి కూడా గాలింపు చర్యలు చేపట్టారు.ఫెర్రీలో వంద మందికి పైగా ప్రయాణికులు, మరికొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దుర్ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.