Amit Shah on Congress : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘించారని ఆరోపించారు. పార్లమెంట్లో అంబేడ్కర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించదని, ఆయనను ఎప్పటికీ, కనీసం కలలోనూ అవమానించనలేని పార్టీ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈమేరకు స్పష్టత ఇచ్చారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " ......since yesterday, congress has been presenting the facts in a distorted way and i condemn it... congress is anti-br ambedkar, it is against reservation and the constitution. congress also insulted veer savarkar. by… pic.twitter.com/V2QYjPz11V
— ANI (@ANI) December 18, 2024
'రాజ్యాంగ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్'
'కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరణానంతరం ఆయనకు భారతరత్న ఇచ్చింది. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదు. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ను ఎంతో గౌరవించింది. ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉంది. కలలో కూడా అంబేడ్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చా. ఎమర్జెన్నీ విధించడం ద్వారా రాజ్యాంగ విలువలను ఉల్లఘించింది. ఆ వాస్తవాలన్నీ బయటకు రాగానే కాంగ్రెస్ తన పాత ట్రిక్కులను ఉపయోగించి వాస్తవాలను వక్రీకరిస్తుంది' అని అమిత్ షా మండిపడ్డారు.
#WATCH | Delhi: On opposition's protest against him, Union Home Minister Amit Shah says, " ...i would have been happy if they had challenged the facts presented in my speech. every word of my speech is factual and taken from history. that is why they are making such efforts by… pic.twitter.com/86iQttJb8U
— ANI (@ANI) December 18, 2024
'అంబేడ్కర్‌పై గౌరవం ఉంటే అమిత్ షాను తొలగించాలి'
అమిత్ షా ప్రెస్‌మీట్‌కు కాసేపటి ముందు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అంబేడ్కర్‌పై ప్రధాని మోదీకి గౌరవముంటే తక్షణం అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను సమర్థిస్తూ మోదీ ట్వీట్లు చేయడాన్ని ఖర్గే తప్పుబట్టారు. అమిత్ షా ఏం చెప్పారో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం మొత్తం చూసిందన్నారు. ఆయన మాటలు కేవలం మనుస్మృతిలో మాత్రమే ఉంటాయని విమర్శించారు. అలాంటి వాటిని అంబేడ్కర్ ఎప్పుడూ సమర్థించలేదన్నారు.
'ఇలాంటి సిద్ధాంతాన్ని అంబేడ్కర్ చెప్పలేదు. స్వర్గం, నరకం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మాటలను హోంమంత్రి మాట్లాడితే మోదీ ఆయన్ను సమర్థించేందుకు ఆరు ట్వీట్లు చేశారు. అంత అవసరమేంటి? బాబాసాహెబ్ గురించి తప్పు మాట్లాడితే మీరు ఆయన్ను(అమిత్ షాను) కేబినెట్ నుంచి తొలిగించాలి. కొనసాగించకూడదు. కానీ ఇద్దరూ మంచి మిత్రులు. అందుకే ఒకరి పాపాలను మరొకరు సమర్థించుకుంటున్నారు' అని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.