How To Make Garlic Rice Recipe : పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం తల్లులకు సవాలే. చాలా మంది పిల్లలు తినకుండానే బాక్స్ ఇంటికి మోసుకొస్తుంటారు. అది చూసి.. పిల్లలు సరిగా తినట్లేదని అమ్మలు ఆవేదన చెందుతుంటారు. మీ పిల్లలు కూడా చేస్తున్నా.. లేదంటే వెరైటీగా ఏదైనా కావాలని అడుగుతున్నా.. ఒక్కసారి ఈ 'గార్లిక్ రైస్' ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎంతో టేస్టీగా ఉండే దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకే కాదు.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా(Breakfast)గా కూడా ఈ రైస్ పనిచేస్తుంది. మరి.. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
గార్లిక్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు - బియ్యం
- పావు కప్పు - వెల్లుల్లి
- పావు కప్పు - తరిగిన క్యారెట్ ముక్కలు
- 4 టేబుల్ స్పూన్లు - బీన్స్ ముక్కలు
- మూడు టేబుల్ స్పూన్లు - నూనె
- పావు టీస్పూన్ - మిరియాల పొడి
- పావు టీస్పూన్ - వైట్ పెప్పర్ పొడి
- 1 టీస్పూన్ - సోయా సాస్
- 1 టీస్పూన్ - వెనిగర్
- 1 టీస్పూన్ - స్ప్రింగ్ ఆనియన్స్
- అర టీస్పూన్ - ఒరిగానో
- రుచికి సరిపడా - ఉప్పు
హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!
గార్లిక్ రైస్ తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక రైస్‌ను.. మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే వెల్లుల్లి రెబ్బల పొట్టు తొలగించి స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి.
- వీటితో పాటు బీన్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్‌ను కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక అందులో.. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగించుకోకుండా.. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అందులోనే మరికాస్త ఆయిల్ పోసుకొని క్యారెట్, బీన్స్ ముక్కలను వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగకుండా చూసుకోవాలి.
- వీటిని ఫ్రై చేసుకున్నాక.. వేయించి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉడికించుకున్న రైస్ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మిరియాల పొడి, వైట్ పెప్పర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- ఆపై.. సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి.
- చివరగా.. సాల్ట్ సరిపోయిందో లేదో రుచి చూసుకుంటే సరిపోతుంది. అంతే.. రుచికరమైన గార్లిక్ రైస్ మీ ముందు ఉంటుంది.
- ఈ సారి తప్పకుండా ట్రై చేయండి.. పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.
బ్రెడ్‌తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!