తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​ న్యూస్​ - ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు - కొత్త డేట్ ఇదే!

Free Aadhar Update Deadline Extended : ఆధార్​ యూజర్లకు గుడ్ న్యూస్​. ఆధార్​ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు విధించిన గడువును ఉడాయ్​ మరో 3 నెలలపాటు పొడిగించింది. కనుక ఇంకా ఎవరైతే ఆధార్​ను అప్​డేప్ చేసుకోలేదో వారు జూన్​ 14లోపు ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

Aadhaar Card Update last date
free aadhar update deadline extended

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 7:33 AM IST

Free Aadhar Update Deadline Extended : ఆధార్​ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు ఇచ్చిన గడవును మరోసారి పొడిగించింది ఉడాయ్​. వాస్తవానికి మార్చి 14తోనే ఆధార్ ఫ్రీ అప్​డేట్ గడువు ముగిస్తోంది. అయినప్పటికీ ఇంకా చాలా మంది ఆధార్ వివరాలను అప్​డేట్ చేసుకోలేదు. అందుకే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ ఉచిత అప్​డేట్​కు మరో 3 నెలల వరకు గడువు పొడిగించింది. అందువల్ల జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్​లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

గడువులు పొడిగిస్తూనే ఉంది!
ఉడాయ్​ తొలుత 2023 మార్చి15 వరకు ఉచితంగా ఆధార్ అప్​డేట్​ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తరువాత ఈ గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం వల్లనే ఈ గడువును పొడిగించినట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

వీరు కచ్చితంగా అప్​డేట్ చేయాల్సిందే!
'ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లు పూర్తైన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించవచ్చు. చిరునామా ధ్రువీకరణ పత్రాలుగానూ వీటిని ఉపయోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి వాటిని గుర్తింపు ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) అడ్రస్​ ప్రూఫ్​లుగా వినియోగించ్చుకోవచ్చు' అని ఉడాయ్‌ పేర్కొంది. అయితే ఈ ఉచిత సేవలు 'మై ఆధార్‌’ పోర్టల్‌' ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని ఉడాయ్​ స్పష్టం చేసింది.

ఫ్రీగా ఆధార్​ అప్‌డేట్‌ చేసుకోండిలా!

  • ముందుగా మీరు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • పోర్టల్​లో మీ ఆధార్​ సంఖ్యతో లాగిన్​ కావాలి.
  • 'ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • తర్వాత 'డాక్యుమెంట్‌ అప్‌డేట్‌'పై క్లిక్‌ చేయాలి.
  • అప్పటికే ఉన్న వివరాలు మీ ఫోన్​ లేదా కంప్యూటర్​ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అప్పుడు మీ పేరులో, పుట్టిన తేదీలో, ఇంటి చిరునామా లాంటి వాటిలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, వాటిని వాటిని మార్చుకోవాలి. ఒకవేళ ఏమి మార్చాల్సిన అవసరం లేకపోతే, ఉన్న వివరాలనే ఒకసారి వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి 'ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌' డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
  • సంబంధిత స్కాన్డ్​ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.
  • చివరిగా 14 అంకెల 'అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌' వస్తుంది.
  • దీని ద్వారా అప్‌డేటెడ్​ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు https://myaadhaar.uidai.gov.in/ వెబ్​సైట్​లో చెక్‌ చేసుకోవచ్చు. అంతే సింపుల్​!

'CAAను చూసి భారతీయ ముస్లింలు భయపడొద్దు- హిందువులతో సమానంగా వారికి హక్కులు'

స్మాల్​​/ మిడ్​ క్యాప్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details