తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన పెద్దలు తిన్న 'చల్ది అన్నం' - అనేక రోగాలకు దివ్య ఔషధం - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - CHADDI ANNAM RECIPE - CHADDI ANNAM RECIPE

Fermented Rice Recipe : ఇవాళ ప్రతి ఇంట్లోనూ పొద్దున టిఫెన్ తింటారు. సకల రోగాలతో బాధపడుతుంటారు. కానీ.. మన పూర్వీకులు చల్ది అన్నం తినేవారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఆ చల్ది అన్నం మీరు కూడా తినాలకునుకుంటున్నారా? అయితే.. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి.

How To Make Probiotic Curd Rice
Fermented Rice Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 5:13 PM IST

How To Make Probiotic Curd Rice :నేటి రోజుల్లో అంటే మనం మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, బోండా, పూరీ, దోశ.. ఇలా రకరకాల టిఫెన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటున్నాం. లేదంటే బయట టిఫెన్ సెంటర్​లో ఏదో ఒక ఐటమ్ తినేస్తుంటాం. కానీ.. పూర్వీకులకు ఇలాంటి టిఫెన్స్ ఏవి తెలియదు. జొన్న అన్నం, రాగి సంకటి, చల్ది అన్నం ఇలాంటివి తీసుకునే వారు. ముఖ్యంగా పొద్దున్నే పనులలోకి వెళ్లేవారు చల్ది రైస్ ప్రిపేర్ చేసుకొని తినేవారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతుంటారు. మరి, అలాంటి చల్ది అన్నం మీరూ టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • అన్నం - ఒకటిన్నర కప్పులు
  • వేడినీళ్లు - ఒక కప్పు
  • పాలు - ఒక కప్పు
  • మజ్జిగ - మూడు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - కొన్ని
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో మెత్తగా ఉడికించుకున్న అన్నం, వేడినీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా బాగా మరిగించిన పాలను అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కాసేపటికి అంటే.. అన్నం మిశ్రమం వేడి తగ్గాక మజ్జిగను పోసుకొని మిక్స్ చేసుకోవాలి.
  • అయితే, చాలా మంది పెరుగు(Curd) వేసుకొని చల్ది అన్నం తయారు చేసుకుంటారు. కానీ, అలాకాకుండా మజ్జిగను వాడితే ఆ టేస్ట్ సూపర్​గా ఉంటుంది.
  • అంతేకాదు.. మన పెద్దలు 'పెరుగు' వేడి అని చెబుతుంటారు. ఎందుకంటే.. గట్టిగా పేరుకున్న పెరుగు పేగుల్లోకి చేరి ఆమ్లాలతో కలిసి అది అరగడానికి టైమ్ పడుతుంది. ఆ సమయంలోనే అది పులవడం మొదలవుతుంది. పులుస్తున్న కొద్దీ వేడి పెరుగుతుందంటున్నారు. ఈ కారణం చేతనే 'మజ్జిగ' చలువ అని చెబుతుంటారు మన పెద్దలు.
  • అందుకే.. చల్ది అన్నం తయారీలో మీరు పెరుగుకు బదులుగా మజ్జిగను వాడడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
  • ఆ విధంగా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక.. ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్​ ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి.
  • ఆపై బౌల్​పై మూత ఉంచి మిశ్రమాన్ని రాత్రంతా అలా ఉంచాలి. అయితే, ఇందుకోసం.. మట్టిపాత్రలను వాడితే మంచి టేస్ట్​తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు.
  • ఇక తర్వాతి రోజు మూత తీసి చూస్తే ఆ మిశ్రమం పెరుగు తోడుకున్న మాదిరిగా కనిపిస్తోంది. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే ప్రోబయోటిక్ 'చల్ది అన్నం' రెడీ!
  • దీన్ని డయాబెటిస్, ఎసిడిటీ, బీపీ ఉన్నవారు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details