తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలక్ట్రిక్​ బైక్​గా పాత పెట్రోల్​ బండి - రూ.9తో​ 50కి.మీ జర్నీ

పాత పెట్రోల్​ బైక్​ను ఎలక్ట్రిక్​ బండిగా మార్చిన మెకానిక్ - కేవలం రూ.35 వేలతో తయారీ - ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 50కిమీ ప్రయాణం

Petrol Bike Convert To Electric Bike
Petrol Bike Convert To Electric Bike (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Petrol Bike Convert To Electric Bike :పర్యావరణ పరిరక్షణ కోసం, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందకు పాత పెట్రోల్ బైక్​ను ఎలక్ట్రిక్ బండిగా మార్చాడు ఓ మెకానిక్. పాత, కొత్త భాగాలను ఉపయోగించి కేవలం రూ.35 వేలతో తయారు చేశాడు. కేవలం రూ.9 ఖర్చుతో 50కిలోమీటర్లు నడిచే విధంగా రూపొందించాడు. అతడే ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మెకానిక్ శ్రీకాంత్.

ఫరూఖాబాద్​ జిల్లాకు చెందిన శ్రీకాంత్- పిండి మిల్లు నడుపుకుంటూ, బైక్​లను రిపేరు చేస్తుంటాడు. ఓ రోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పాత బైక్​ నుంచి విపరీతంగా పొగలు రావడం చూసి, తన బైక్​ కూడా కాలుష్యాన్నికి కారణమవుతుందని గ్రహించినట్లు శ్రీకాంత్ చెప్పాడు. అప్పుడే పర్యావరణానికి హాని కలుగుకుండా ఉండేలా తన బైక్​ను మార్చాలని ఆలోచన వచ్చినట్లు వివరించాడు. అందుకోసం తన దగ్గర 16 ఏళ్లుగా ఉన్న బండిని ఈవీ బైక్​గా మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఎలక్ట్రిక్​ బైక్​తో శ్రీకాంత్ (ETV Bharat)

15 రోజుల్లో తయారీ
పెట్రోల్​ బండిని ఎలక్ట్రిక్​ బైక్​గా మార్చేందుకు వేరే మెకానిక్​ల దగ్గర నుంచి కావాల్సిన సలహా తీసుకోవడమే కాకుండా ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత వాటి కోసం పాత వస్తువులను కొన్నింటిని సేకరించాడు. మిగిలిన కొన్ని భాగాలను కోసం ఆన్​లైన్​లో ఆర్డర్​ చేశాడు. 10-15 రోజుల పాటు కష్టపడి పెట్రోల్​ బండిని పూర్తిగా ఎలక్ట్రిక్​ బైక్​గా మార్చాడు. బండికి చైన్​ కూడా లేదని, పెట్రోల్ ఇంజిన్​ను తీసివేసి దాని స్థానంలో 60 వోల్ట్​ బ్యాటరీని అమర్చినట్లు శ్రీకాంత్ తెపాడు.

'' దీనిని తయారు చేసేందుకు నాకు రూ.30 నుంచి రూ.35 వేలు ఖర్చు అయ్యింది. ఒక్కసారి ఛార్జింగ్ చేసేందుకు ఒకటిన్నర యూనిట్ల విద్యుత్​ ఖర్చు అవుతుంది. అంటే సుమారు రూ.9. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్​ చేస్తే గంటకు 50 కిమీ వేగంతో 50 కిమీ దూరం ప్రయాణించవచ్చు. సాధారణంగా ఒక లీటర్​ పెట్రోల్​తో 50 నుంచి 60 కిమీ ప్రయాణిస్తాయి. లీటర్​ పెట్రోల్ ధర దాదాపు రూ.108 ఉంది. దీంతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువగా అవుతుంది. అయితే బ్యాటరీని వెనుక భాగంలో అమర్చితే పెట్రోల్, ఎలక్ట్రిక్​ బైక్​గా ఉపయోగించుకోవచ్చు."
- శ్రీకాంత్, మెకానిక్

శ్రీకాంత్ తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ (ETV Bharat)

ఈ బైక్ ఓవర్​లోడ్​ అయినప్పటికీ బాగానే రన్​ అవుతుందని శ్రీకాంత్ అంటున్నాడు. లగేజీతో పాటు ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చని, దీని నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని తెలిపాడు. కొత్త పెట్రోల్, ఎలక్ట్రిక్ బైక్​లు ధర ఎక్కువగా ఉంటుందని, వాటిని కొనలేని వారు పాతవి, పనికిరాని వాహనాలను ఈ విధంగా సులభంగా మార్చుకోవచ్చని అంటున్నాడు. దీని వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని, పెద్దగా శబ్దం కూడా చేయదని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details