తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కంటిపై దాడి' కేసులో కొత్త ట్విస్ట్- పరువు పోయిందిగా! - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Embarrassment To BJP Candidate : కేరళలోని కొల్లాం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జి కృష్ణకుమార్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై సొంత పార్టీ నాయకుడే దాడికి తెగబడ్డారు. స్కూటర్ తాళం చెవితో కృష్ణకుమార్‌ కంట్లో పొడిచాడు. ఈ దాడి ఇతర పార్టీల పనై ఉండొచ్చని తొలుత అనుమానించిన పోలీసులు దర్యాప్తులో వెల్లడైన నిజాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

Embarrassment To BJP Candidate
Embarrassment To BJP Candidate

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 6:19 PM IST

Embarrassment To BJP Candidate :రాజకీయ పార్టీల నాయకులపై ప్రత్యర్థి పార్టీల క్యాడర్ దాడి చేసిన సందర్భాలను మనం చూశాం. అయితే కేరళలోని కొల్లం లోక్‌సభ స్థానంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ సీటు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జి కృష్ణ కుమార్‌ వింతైన చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. స్కూటర్ తాళం చెవితో నేరుగా కృష్ణ కుమార్‌ కంట్లో పొడిచాడు. దీంతో కంటికి తీవ్ర గాయమైంది. కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం కూడా ఆపేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఒకప్పుడు కేరళలో నటుడిగా మంచిపేరు సంపాదించి రాజకీయాల్లోకి ప్రవేశించిన కృష్ణ కుమార్‌‌కు చేదు అనుభవం ఎదురైనట్లు అయింది.

అవాక్కయిన పోలీసులు..
తనపై జరిగిన దాడి గురించి బీజేపీ అభ్యర్థి జి కృష్ణ కుమార్‌ కుందర పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ దాడి చేసింది రాజకీయ ప్రత్యర్థులై ఉండొచ్చనే కోణంలో తొలుత విచారణ నిర్వహించారు. అయితే ఈ దాడిలో ఇతర పార్టీల నేతలెవరూ పాల్గొనలేదని తేలింది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతల గురించి పోలీసులు ఆరా తీయగా స్థానిక నేత సనల్ పుతన్విలా ఈ దాడి చేశాడని విచారణలో తేలింది. ఈ విషయం తెలిసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. నిందితుడు సనల్ పుతన్విలా‌పై ఐపీసీలోని 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వెంటనే అతడిని అరెస్టు చేయగా, బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రత్యర్థులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి కృష్ణ కుమార్​కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. అయితే, దాడి చేసింది సొంత పార్టీకి చెందిన వ్యక్తే అని తేలడంపై కృష్ణ కుమార్ ఇంకా స్పందించలేదు.

ABOUT THE AUTHOR

...view details